నిద్ర మాత్రలిచ్చి..గోనెసంచుల్లో కుక్కి..బావిలో తోసి..క్రూరంగా 9 హత్యలు!

నిద్ర  మాత్రలిచ్చి..గోనెసంచుల్లో కుక్కి..బావిలో తోసి..క్రూరంగా 9 హత్యలు!
x
Highlights

రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట బావి హత్యల కేసులో మిస్టరీ వీడింది.

రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట బావి హత్యల కేసులో మిస్టరీ వీడింది. మూడు రోజులుగా జరుగున్న విచారణలో సంచలన నిజం బయటపడింది. మొదటి నుంచి పోలీసులు అనుమానిస్తున్న విధంగానే వారంతా హత్యకు గురయ్యారు. తొమ్మిది మందిని తానే హత్య చేసినట్లు నిందితుడు సంజయ్ యాదవ్ నేరం అంగీకరించాడు. కుట్రపూరితంగానే స్నేహితలతో కలిసి అందరిని హత్య చేసి భావిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు.

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రకుంటలోని బావిలో చనిపోయిన తొమ్మిది మందివి హత్యలుగానే పోలీసుల దర్యాప్తులో తేలింది. నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసినట్లు నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ అంగీకరించాడు. అపస్మారక స్థితిలోవెళ్లిన తర్వాత తొమ్మిది మందిని బావిలో పడేసినట్లు నేరాన్ని అంగీకరించాడు.

ఈ కేసులో మొదట గురువారం నాలుగు మృత దేహాలు నీళ్లలో తేలాయి. శుక్రవారం మరో ఐదు శవాలు బావిలో వెలుగుచూశాయి. మృతుల్లో పశ్చిమబెంగాల్ కు చెందిన ఒకే కుటంబంలోని ఆరుగురు, ఇద్దరు బీహారీలు, ఒకరు త్రిపువ వాసి ఉండటం సంచలనం కల్గించింది. ఆధారాలు ఏవీ లభించకపోవడంతో తొమ్మిది మంది అనుమానస్పద స్థితిలో మరణించినట్లు ప్రకటించిన పోలీసులు..మిస్టరీనీ ఛేదించేందుకు ఆరు బృందాలుగా రంగంలోకి దిగారు. తొమ్మిది మంది మృత దేహాలకు పోస్ట్ మార్టం జరిగిన తర్వాత కచ్చితంగా హత్యలేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

హత్య కోణంలో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసు బృందాలు గొర్రకుంటలోని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గోనె సంచల గోదాము ఆవరణ, పాడుబడిన బావి పరిసరాలను పరిశీలించారు. మృతుల మొబైల్స్ కాల్స్ డేటాపై ఫోకస్ పెట్టారు. మరణించిన తొమ్మిది మందిలోని ఎండీ మక్సూద్‌, అతని భార్య నిషా, కూతురు బష్రాఖాతూరు, ఇద్దరు బీహారీలు శ్యామ్‌కుమార్‌, శ్రీరామ్‌కుమార్‌, షకీల్‌ మొబైల్స్‌కు ఘటన జరగడానికి ముందు వచ్చిన ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ డేటా తీశారు. తమకు లభించిన ఆధారాలతో వరంగల్‌లో ఉంటున్న బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌ యాదవ్‌తో పాటు మరో యువకుడిని, మక్సూద్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వరంగల్‌కు చెందిన యాకూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు సంజయ్ చెప్పాడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత గోనె సంచుల సహయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించారు. గత బుధవారం రాత్రి గొర్రెకుంటలో మక్సూద్ కుటుంబ నివసిస్తున్న గదుల్లో మక్సూద్ కూతురు బష్రా కూతురు కొడుకు బర్త్ డేను డెత్ డేగా మార్చుకోవాలని ప్లాన్ చేశాడు. అంతే కాదు అందరిని ఒకే సారి హత్య చేయాలని ప్లాన్ చేశాడు. కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత గోనె సంచిలో కుక్కి బావిలోపడేశాడు.

ఇందుకోసం సంజయ్ యాదవ్ స్థానికంగా ఉన్న ఇద్దరు ఆటోడ్రైవర్ల సాయం తీసుకున్నాడు. వీరందరికి ఖతూన్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ చేశాడు. ఖతూన్ స్క్రీన్ ప్లే ప్రకారమే ఈ హత్యలకు పాల్పడ్డాడు. అందుకోసం మక్సూద్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న సంజయ్ యాదవ్ ను పావుగా వాడుకున్నాడు. మక్సూద్ కుటుంబంపై ఉన్న పగను తీర్చుకునేందుకు ఖతూన్ సంజయ్ ను వాడుకున్నాడు.

మొత్తం మీద తొమ్మిది మంది హత్యలను ఓ సినీ ఫక్కిలో నడిపించాడు. దీంతో నిందితుడు పూర్తిగా ప్రొఫెషనల్ కిల్లర్ శైలీలో వ్యవహరించడంతో.. పోలీసులు ఈ కేసును మొదట ఆత్మహత్య అని భావించారు. అయితే.. ఘటన స్థలంలో దొరికిన ఆధారాలు, ఆనవాళ్లు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచడం, నిందితుడి నుంచి నిజాలు రాబట్టడంతో ఈ కేసు చిక్కుముడి వీడింది..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories