Telangana: సైబర్‌ నేరాలు అరికడతాం: సైబరాబాద్‌ సీపీ

Telangana: సైబర్‌ నేరాలు అరికడతాం: సైబరాబాద్‌ సీపీ
x
Highlights

టెక్నాలజీ పెరిగిపోతున్న కొలది సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

టెక్నాలజీ పెరిగిపోతున్న కొలది సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గురువారం సైబర్‌ క్రైం, ట్రాఫిక్‌, మహిళల భద్రతపై కాన్ఫరెన్స్‌ నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ కొంత మంది వ్యక్తులు ఎక్కడో కూర్చుని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారని, ఆ నేరాల సంఖ్యను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

స్మార్ట్‌ ఫోన్ల ద్వారా కూడా సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గడిచిన ఐదేళ్ల కాలం నుంచి సైబర్‌ క్రైం, ట్రాఫిక్‌, మహిళల భద్రతపై కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో పాఠశాలలు, కళాశాలల్లో నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు. సైబర్‌ నేరాలతో మహిళలు అధిక శాతంలో నష్టపోతున్నారని, మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు నిపుణులతో అవగాహన కల్పించామని తెలిపారు.

ఇదే సందర్భంలోనే సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ చైర్మన్‌ భరణి మాట్లాడుతూ సామాన్య ప్రజల నుంచి ఐటీ కంపెనీల వరకు సైబర్‌ క్రైం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న నేరాలపై కూడా కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు. గతంలో ఐటీ కంపెనీల డేటాను చోరీ చేసిన సందర్భాలు ఉన్నాయని ఆ‍యన గుర్తు చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories