హెల్మెట్ ధరిస్తే లీటర్ పెట్రోల్ ఫ్రీ

హెల్మెట్ ధరిస్తే లీటర్ పెట్రోల్ ఫ్రీ
x
Highlights

రాష్ట్రంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోయి, ఎంతో మంది వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

రాష్ట్రంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోయి, ఎంతో మంది వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చనిపోయిన వారిలో కూడా ఎక్కువ శాతం మంది హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల తమ ప్రాణాలకు కోల్పోతున్నారని పోలీస్ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు వాహణదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఇక పోతే 31వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పోలీస్ అధికారులు వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఈ సందర్భంగా ఏఎస్ఐ అంజపల్లి నాగమల్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సగటున ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ శాతం మంది మృతి చెందుతున్నారని తెలిపారు.

ప్రమాదాలు సంభవించినపప్పుడు వాహణదారులు చనిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వారితో పాటుగానే ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తులు కూడా హెల్మెట్ ధరించాలని తెలిపారు. అంతే కాకుండా మద్యం సేవించి వాహణాలను నడపకూడదని తెలిపారు. ఎవరైనా నిబంధనలను మీరి వాహనాలు నడిపిస్తే జరిమానా తప్పదన్నారు.

అనంతరం ప్రమాదాలను అరికట్టే విధంగా వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వాహనచోదకులకు వివరించినట్టు చెప్పారు. అనంతరం వాహనచోదకుడితో సహా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్లు ధరిస్తే వారికి మంచి ఆఫర్ ను ప్రకటించారు. పోలీసులు తమ సొంత ఖర్చుతో ఒక లీటర్ పెట్రోల్ కూపన్లు ఉచితంగా ప్రయాణికులకు అందజేశారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు వాహణాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వారి ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories