హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
x
Highlights

హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్...

హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో రోజు సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇందిరా పార్క్ వద్ద దీక్షకు పిలుపునిచ్చారు. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వడకపోవడంతో గన్ పార్క్ వద్ద నివాళులర్పించి అనంతరం సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

అయితే గన్ పార్క్ వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు అశ్వద్ధామరెడ్డితో పాటు మరికొంత మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బలవంతంగా పోలీసు వాహనాలలు ఎక్కించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై నాయకులు మండిపడుతున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇక్కడే నిరసన వ్యక్తం చేశారని ఇప్పుడు తాము నిరసన వ్యక్తం చేస్తుంటే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇది ప్రభుత్వ పతనానికి నాంది అన్నారు. నిన్నటి వరకు ఇది కేవలం ఆర్టీసీ పోరాటమని ఇప్పుడిది ప్రజాస్వామ్య పోరాటమన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories