పేదల చదువుకు పాకెట్‌మనీ

పేదల చదువుకు పాకెట్‌మనీ
x
Highlights

చాలా పాఠశాలలో విద్యార్థులు విద్యను మాత్రమే బోధిస్తారు. అన్ని పాఠశాలల కంటే తమ పాఠశాల మాత్రమే చదువులో ముందంజలో ఉండాలనుకుంటారు. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ లు...

చాలా పాఠశాలలో విద్యార్థులు విద్యను మాత్రమే బోధిస్తారు. అన్ని పాఠశాలల కంటే తమ పాఠశాల మాత్రమే చదువులో ముందంజలో ఉండాలనుకుంటారు. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ లు ఎలా తెప్పించాలా అన్న ఆలోచనలోనే ఉంటారు. కానీ ఈ పాఠశాలలకు భిన్నంగా ఒక కార్పోరేట్ పాఠశాల ఆలోచించింది. విద్యార్థులకు విద్య మాత్రమే కాకుండా మానవత్వాన్ని కూడా నేర్పుతుంది. కష్టాల్లో ఉన్న వారికి ఏ విధంగా సాయ పడాలో నేర్పుతూ వారిలో సేవాగుణాన్ని పెంపొందిస్తున్నది. విద్యార్థుల ఆలోచనలను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. విద్యార్థులకు చదువుతోపాటు మానవతా విలువలు నేర్పిస్తున్నది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని సిల్వర్‌ఓక్స్ అంతర్జాతీయ పాఠశాల యాజమాన్యం ఈ వినూత్న ఆలోచనలకు తెరతీసింది. చాలా మంది విద్యార్థులకు తమ తల్లి దండ్రులు పాకెట్ మనీని ఇస్తారు. దీంతో ఆ విద్యార్థలు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఈ విషయాలన్ని తెలిసిన పాఠశాల యాజమాన్యం విద్యార్థలు డబ్బులను వృథాగా ఖర్చు చేయకుండా ఎలా కూడబెట్టుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. స్వయంగా పాఠశాల యాజమాన్యమే విద్యాసంవత్సం ఆరంభంలో విద్యార్థులకు మట్టితో చేసిన గల్లగురిగీలను అందజేస్తున్నది. విద్యార్థులకు ఇచ్చిన గల్ల గురిగిలలో వారికి ఇచ్చిన డబ్బులను జమచేసుకోవాలని తెలియజేస్తున్నారు.

ఇలా దాచిపెట్టిన సొమ్మును ఆరునెలల తర్వాత గల్లగురిగితో సహా పాఠశాలకు అప్పగించాల్సి ఉంటుంది. తరువాత విద్యార్థుల నుంచి సేకరించిన మొత్తాన్ని విద్యార్థుల ముందే లెక్కిస్తుంది. జమ అయిన మొత్తం డబ్బును వరంగల్‌లోని రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) మీ అండ్ మై కంట్రీ వుయ్‌గ్రో టుగెదర్ కాయిన్‌ఫర్ ది కంట్రీ సంస్థకు, అలాగే గుంటూర్‌లోని నీడి ఇల్లిటరేట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ (ఎన్‌ఐసీఈ) అనే స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తున్నారు.

2005 నుంచి ప్రతి సంవత్సరం డబ్బు సేకరించి పేద విద్యార్థుల చదువు కోసం అందజేసి స్ఫూర్తిగా నిలుస్తున్నది. గడిచిన 13 సంవత్సరాల్లో మొత్తం రూ.1,25,16,144ను విరాళంగా అందజేసింది. ఈ సంవత్సరం కూడా విద్యార్థుల నుంచి సేకరించిన డబ్బులన మంచిపనికి వినియోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం అందజేసిన మొత్తాన్ని స్వచ్చంద సంస్థలు పేద విద్యార్థుల చదువుల కోసం వినియోగిస్తుంటారు. ఈ విధంగా ప్రతిఏటా ఎంతో మంది పేద విద్యార్థులకు సాయం చేస్తున్న ఈ చిట్టి చేతులు పెద్దయ్యాక కూడా సాయం చేయాలని పాఠశాల యాజమాన్యం తెలుపుతుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories