ప్లాస్టిక్ బాటిల్ వేసారో నుజ్జు నుజ్జే

ప్లాస్టిక్ బాటిల్ వేసారో నుజ్జు నుజ్జే
x
బాటిల్‌ క్రషింగ్‌ మిషన్‌
Highlights

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లలో సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు చేపడుతోంది. చాలా మంది ప్రయాణికులు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను వాడి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. ఆ బాటిళ్ల ద్వారా రైల్వే ట్రాక్ వద్ద చాలా చెత్త పేరుకుపోతుంది. దీని ద్వారా కాలుష్యం కూడా చాలా పెరిగిపోతుంది.

ఈ కాలుష్యాన్ని పోగొట్టాలంటే ముందు ప్లాస్టిక్ ని నివారించాలి. ఈ క్రమంలోనే రైల్వే శాఖ ఒక మంచి ఆలోచన చేసింది. నగరంలోని వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో ఇటీవల 'బాటిల్‌ క్రషింగ్‌ మిషన్‌'లను ఏర్పాటు చేశారు. ఈ మిషన్లు 24 గంటల పాటు పని చేస్తూనే ఉంటాయి. ఎవరైనా తమ వద్ద ఉన్న ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లు, కప్పులు, గ్లాస్‌లు, ప్లేట్లు ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను ఈ యంత్రంలో వేస్తే చాలు ఈ యంత్రం వాటిని చిన్నచిన్న ముక్కలుగా మారుస్తుంది. తరువాత ఆ ముక్కలను బయటికి తీసి ప్లాస్టిక్‌ వ్యర్థాలు కరగదీసే ఫ్యాక్టరీకి పంపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

అయితే ఇది వరకు పూణే రైల్వే స్టేషన్‌లోనూ ఇలాంటి యంత్రాన్నే ఏర్పాటు చేశారు. ఈ యంత్రంలో బాటిల్‌ వేసినట్లయితే పేటీఎం ద్వారా రూ.5 జమ అవుతాయని ప్రచారం చేసారు. దీంతో ప్రయాణికులు వారు వాడిన ప్లాస్టిక్ బాటిళ్లను మిషిన్ లో వేయడం మొదలు పెట్టారు. ఎవరైతే బాటి‌ళ్లను మిషన్ లో వేస్తారో వారికి ప్రచారం చేసినట్టుగానే డబ్బులు జమ అయ్యాయి.

ఇప్పుడు ఖాజీపేటలో ఏర్పాటు చేసిన యంత్రాలను ప్రయాణికులకు ఉపయోగించేటట్టు రైల్వే అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పర్యావరణం పై అవగాహన ఉన్న కొంతమంతి బాటిళ్లను యంత్రాలలో పాడేస్తున్నారు. ఈ మిషిన్లని రైల్వే శాఖ అన్ని స్టేషన్లలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories