బ్రతికి ఉన్న తల్లిని శ్మశానంలోకి తీసుకోచ్చి...

బ్రతికి ఉన్న తల్లిని శ్మశానంలోకి తీసుకోచ్చి...
x
Highlights

కన్నతల్లికి.. మనం ఎన్ని ఇచ్చిన.. ఆ రుణాన్ని తీసుకోలేం. తల్లి తన బిడ్డల కోసం అనుక్షణం పడే తపన, ఆవేదనను మనం ఏమిచ్చి కూడా ఆరుణాన్ని తీర్చలేం. కన్న తల్లి ప్రేమ అలాంటిది.

కన్నతల్లికి.. మనం ఎన్ని ఇచ్చిన.. ఆ రుణాన్ని తీసుకోలేం. తల్లి తన బిడ్డల కోసం అనుక్షణం పడే తపన, ఆవేదనను మనం ఏమిచ్చి కూడా ఆరుణాన్ని తీర్చలేం. కన్న తల్లి ప్రేమ అలాంటిది. కానీ ఈ వార్త మాత్రం పై అభిప్రాయాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద తన తల్లిని పోషించడం భారంగా భావించంచి బ్రతికి ఉండాగానే తన తల్లిని బోంత పెట్టాలని అనుకున్నాడు ఓ కోడుకు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. వీక్లీ బజార్‌కు చెందిన చేట్పల్లి నర్సమ్మకు 95 ఏండ్ల వయసు ఉంటుంది. తన భర్త 30ఏళ్ల కిందటే కన్నమూశారు. ఇక అప్పటి నుండి తన ధర్మయ్య దగ్గర ఉంటుంది.

అయితే తల్లి వృద్ధురాలు కావడంతో అనారోగ్యానికి గురైంది. ధర్మయ్య ఉండేది అద్దె ఇల్లు.. తల్లి ఇంట్లోనే చనిపోతే ఇంటి యజమానితో మాట పడాల్సి వస్తుందన్న భయంతో తల్లి కన్నుమూయక ముందే శ్మశానానికి తరలించాడు. అక్కడున్న ఓ గదిలో ఉంచాడు. వృద్ధురాలి దీనస్థితిని చూసి తీవ్ర అనారోగ్యంతో పడిఉన్న నర్సమ్మను స్థానికులు హుటాహుటినా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సమ్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories