జాతరలో పందుల పోటీ.. మొదటి బహుమతి ఎంతో తెలుసా?

జాతరలో పందుల పోటీ.. మొదటి బహుమతి ఎంతో తెలుసా?
x
Highlights

సాధారణంగా గ్రామాల్లో జాతరలు జరిపితే ఎడ్ల పందాలు, ఎడ్ల బండ్లతో పందాలు నిర్వహించే వారు. ఇక సంక్రాంతి పండగ వచ్చిందంటే కోళ్ల పందాలు, మరికొన్ని ప్రాంతాల్లో పొట్టేల్లతో పందెం కాస్తారు.

సాధారణంగా గ్రామాల్లో జాతరలు జరిపితే ఎడ్ల పందాలు, ఎడ్ల బండ్లతో పందాలు నిర్వహించే వారు. ఇక సంక్రాంతి పండగ వచ్చిందంటే కోళ్ల పందాలు, మరికొన్ని ప్రాంతాల్లో పొట్టేల్లతో పందెం కాస్తారు. అంతే కాదు ఇతర దేశాలలో కుక్కలు, పిల్లుల పందాలు కూడా నిర్వహిస్తారు. ఇప్పటి వరకూ ఎక్కడ కూడా పందులతో పందాలు నిర్వహించడం చూడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఓ దేవాలయంలో నిర్వహించిన ఉత్సవాలలో పందుల పందాలను నిర్వహించారు. అంతే కాదు ఈ పోటీలో గెలుపొందిన పందులకు మంచి మంచి బహుమతులను కూడా అందించారు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ విచిత్రమైన పందాలు ఎక్కడ నిర్వహించారో ఇప్పుడు తెలుసుకుందాం.

జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ పట్టణంలో తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవాలను అక్కడి భక్తులు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం పందుల పోటీలను మార్కెట్‌ సబ్‌ యార్డు ఆవరణలో ఎరుకలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంతో వినూత్నంగా నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకల నుంచి కూడా 10 జతల పందులను తీసుకొచ్చి పోటీలను నిర్వహించారు. ఇక ఆసక్తికరంగా జరిగిన ఈ విచిత్ర మైన పందుల పోటీని చూడడానికి భక్తులు కూడా భారీగానే వచ్చారు.

ఇక ఈ పోటీ ముగిసిన తరువాత గెలుపొందిన పందుల యజమానులకు బహుమతులను అందించారు. ఇందులో భాగంగానే అయిజకు చెందిన వైఎం శివ అనే అతని పంది మొదటి బహుమతిని సాధించింది రూ. 50,016లను అందుకున్నారు. ఇక రెండో బహుమతిని అయిజకు చెందిన అంజి అనే వ్యక్తికి చెందిన పంది సాధించి రూ. 20.016లను అందుకున్నారు. మూడో బహుమతి తాడిపత్రికి చెందిన గంగన్నఅనే అతని పంది గెలుపొంది, రూ.10.016లను సాధించారని నిర్వాహకులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories