ESI స్కాంలో కీలక మలుపు..బయటపడ్డ ఆడియో టేపులు

ESI స్కాంలో కీలక మలుపు..బయటపడ్డ ఆడియో టేపులు
x
Highlights

ESI కుంభకోణంలో డొంక కదులుతోంది. దేవికారాణితో పాటు మరో ఆరుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు...

ESI కుంభకోణంలో డొంక కదులుతోంది. దేవికారాణితో పాటు మరో ఆరుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లయితే వారిని కూడా విచారిస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

ESI మందుల స్కాం కేసులో దేవికారాణితో పాటు ఆరుగురిని ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు ఏసీబీ అధికారులు. ఏసీబీ కోర్టు వీరికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 11 వరకు రిమాండ్ కొనసాగనుంది. దీంతో ESI స్కాం కేసులోని నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఫోర్జరీ కింద 468 సెక్షన్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో చీటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై 471 సెక్షన్, 120 Bసెక్షన్, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అక్కౌంట్స్ కింద 477a సెక్షన్ తో పాటు పలు సెక్షన్ కింద కేసులను నమోదు చేశారు.

నిందితుడు సురేంద్రనాథ్‌ - ఈఎస్‌ఐ డాక్టర్ మధ్య సంభాషణ

ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో నిందితుడు సురేంద్రనాథ్‌ ఈఎస్ఐ డాక్టర్ మధ్య సంభాషణ ఆడియో క్లిప్ బయటికి వచ్చింది. తప్పుడు ఇండెంట్‌లు పెట్టి, ఎలా బిల్లులు తీసుకోవాలో చెబుతున్న సురేంద్రనాథ్ ఫోన్ ఆడియో మీరూ వినండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories