వాహనాల్లో పెట్రోలుకు బదులు..

వాహనాల్లో పెట్రోలుకు బదులు..
x
Highlights

పెట్రోల్ బంకులకు వెళితే బండ్లలో పెట్రోల్ ని నింపుతారు.

పెట్రోల్ బంకులకు వెళితే బండ్లలో పెట్రోల్ ని నింపుతారు. కానీ ఈ పెట్రోల్ బంక్ లో మాత్రం నీళ్లు నింపుతున్నారు. మీటర్ కొట్టి పంప్ ఆన్ చేస్తే చాలు వాహనాల పెట్రోల్ ట్యాంకులు నీటితో నిండిపోతున్నాయి. ఇలా దాదాపుగా 50 వాహనాలలో పెట్రోలుకు బదులు నీళ్లు నింపడంతో బండ్లన్నీ కాస్త దూరం నడిచి మధ్యలోనే ఆగిపోయాయి.

ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామం దగ్గర్లోని స్థానిక శ్రీ చక్ర ఫ్యుయల్ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బంకుయాజమాన్యం నిర్లక్షం వలన దాదాపు 50 వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహదారులు బంకు యాజమాన్యం పై పోలీసులకు ఫిర్యాదుచేసారు. పెట్రోల్‌ బంకు నిర్వహకుల నిర్లక్ష్యం వల్లే ఈ తప్పు జరిగిందని ఆరోపించారు. తమ వాహనాలు ఆగిపోయినందున నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్‌ చేశారు.

దీంతో ఎస్సై శివ ప్రసాద్‌ కానిస్టేబుళ్లతో బంకు వద్దకు చేరుకొని యంత్రాలను పరిశీలించారు. యంత్రాల్లో నీళ్లు ఎలా వస్తున్నాయా అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. నీళ్ల సీసాలో పెట్రోల్ నమూనాలను తీసుకుని దర్యాప్తు కోసం పంపుతామని, తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్‌ఐ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories