విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపుపై పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు

విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపుపై పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు
x
Highlights

ఆర్టీసీ సమ్మె దృష్యా విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విద్యా సంస్థల మూసివేత అక్రమమని ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేశారు....

ఆర్టీసీ సమ్మె దృష్యా విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విద్యా సంస్థల మూసివేత అక్రమమని ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేశారు. సకాలంలో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులుపడుతారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది.

మరోవైపు ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం, ఆర్టీసీ, కార్మిక సంఘాలు మరోసారి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయనున్నాయి. గతంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఇలాఉంటే కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు‌కు కార్మిక సంఘాలు నివేదిక సమర్పించనున్నాయి. సమ్మె నివారణ, ప్రజల ఇబ్బందులపై న్యాయవాది రాపోలు భాస్కర్ మరో పిల్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్‌లు కలిపి నేడు హైకోర్టు మరోసారి విచారించనుంది. 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories