అమావాస్య వస్తే ఆ ఊరిలో ప్రజలకు కునుకుండదు

అమావాస్య వస్తే ఆ ఊరిలో ప్రజలకు కునుకుండదు
x
Highlights

ఆ ఊరిలో అమావాస్య వస్తే ప్రజలకు కునుకుండదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన. ఇక మేకలు, గొర్రెలు పెంపకం దారులైతే నిద్రపోవడం లేదు. దీనికి కారణం...

ఆ ఊరిలో అమావాస్య వస్తే ప్రజలకు కునుకుండదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన. ఇక మేకలు, గొర్రెలు పెంపకం దారులైతే నిద్రపోవడం లేదు. దీనికి కారణం గ్రామానికి చెందిన ఓ యువకుడే కారణం అంటున్నారు.

ఈ ఊరి పేరు సింగంపేట. వనపర్తి జిల్లా అమరచింత మండలంలో ఉంది ఈ గ్రామం. అమావాస్య వస్తే చాలు ఈ ఊరిలో గొర్రెలు, మేకలు చచ్చిపోతున్నాయి. దీనికి ఎవరు కారణమని ఆరా తీయగా ఇదే గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. రాజు పదో తరగతి వరకు చదువుకున్నాడు. అయితే ఇతడి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో బ్లేడుతో మేకలు, గొర్రెలు గొంతుకోసి రక్తం తాగుతున్నాడు.

రాజు మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో గతంలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే 6 నెలల తర్వాత తిరిగి వచ్చినప్పటి నుంచి ప్రతీ అమావాస్యకు ఇలానే చేస్తున్నాడు. దీంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. చిన్నపిల్లలకు ఏదైనా హాని తలపెట్టవచ్చని ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories