అడవిలో 7 నెమళ్లు అనుమానాస్పద మృతి..

అడవిలో 7 నెమళ్లు అనుమానాస్పద మృతి..
x
Highlights

నెమళ్లను దేశంలో ఎంతో అపురూపంగా చూసుకుంటారు..జాతీయ పక్షి నెమలిని గౌరవిస్తున్నారు. అలాంటి నెమళ్లను కొంత మంది కేటుగాళ్లు వేటాడటం చూస్తూనే ఉన్నాం. ఈ...

నెమళ్లను దేశంలో ఎంతో అపురూపంగా చూసుకుంటారు..జాతీయ పక్షి నెమలిని గౌరవిస్తున్నారు. అలాంటి నెమళ్లను కొంత మంది కేటుగాళ్లు వేటాడటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో వేటగాళ్ల విషప్రయోగంతో ఏడు నెమళ్లు మృతి చెందాయి. మంచిర్యాల జిల్లాలో నన్పూర్ మండలం శ్రీరాంపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల నుంచి వీటిని గమనిస్తున్న దుండగులు అవి నీళ్లు త్రాగే ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

సిరగ్గా అవి వచ్చే సమయానికి విషం కలిపిన వడ్లగింజలను అక్కడ వేయడంతో అవి తిన్న 7 నెమళ్లు మృతి చెందాయి. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన అటవీశాఖ అధికారులు మృతి చెందిన నెమళ్లకు అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు. నెమళ్ల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవడంతో సమగ్ర విచారణకు ఆదేశించారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది రాగి వైర్ల దొంగల కోసం ప్రతి రోజూ గని సమీపంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నెమళ్లకు విషం ఇచ్చి చంపినట్లు సమాచారం. ఎఫ్ డీవో విజయ్ కుమార్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంతోష్ కుమార్ సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించారు. కొన్ని నెమళ్లకు ఈకలు పీకి ఉన్నట్లుగా గుర్తించారు. అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories