మరోసారి మానవత్వం చాటుకున్న పవన్

మరోసారి మానవత్వం చాటుకున్న పవన్
x
Highlights

సిని హీరో, జనసేన అధినేత, పవన్ అంటే అభిమానులకు ఎంతో క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆపదలో ఉన్నవారికి తనకు తోచిన సహయం చేస్తూ.. పవన్ కళ్యాణ్ తనదైన ముద్రవేసుకుంటాడు. తన అభిమాని ఆపదలో ఉన్నరంటే ఎంతదూరమైన ఆసుపత్రికి వెళ్లి పరమర్శిస్తారు.

సినీ హీరో, జనసేన అధినేత, పవన్ అంటే అభిమానులకు ఎంతో క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆపదలో ఉన్నవారికి తనకు తోచిన సహయం చేస్తూ.. పవన్ కళ్యాణ్ తనదైన ముద్రవేసుకుంటాడు. తన అభిమాని ఆపదలో ఉన్నరంటే ఎంతదూరమైన ఆసుపత్రికి వెళ్లి పరమర్శిస్తారు. తాజాగా మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అభిమాని బుడిగయ్య గత కొంతకాలంగా క్యాన్స్రర్‌తో భాదపడుతున్నాడు.

అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని చూడాలని పార్టీ నాయకులకు తెలిపాడు. దీంతో ఈ విషయాని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో బుడిగయ్య, ఆయన కుటుంబం జనసేనానికి కలిసారు. ఈ సందర్భంలో అతని ఆరోగ్య పరిస్థితిపై పవన్ అడిగి తెలుసుకున్నారు. వైద్యఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్ధిక స‌హాయం చేశారు. త‌న అభిమాని అనారోగ్యం నుండి తొందరగా కోలుకోవాల‌ని భ‌గ‌వ‌తుండిని ప్రార్ధిస్తూ వినాయ‌కుడి విగ్ర‌హాన్ని బ‌హూక‌రించారు పవన్. దేవుడు బుడిగ‌య్య‌కు మంచి చేయాల‌ని జనసేనాని ఆకాంక్షించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories