Corona Effect: హైదరాబాద్‌లో పార్కులన్నీ మూసివేత

Corona Effect:  హైదరాబాద్‌లో పార్కులన్నీ మూసివేత
x
Highlights

కరోనా వైరస్ మనుషులనే కాదు, వ్యాపారాలను కూడా కుదేల్ చేస్తుంది. కరోనా ఎఫెక్ట్ తో షాపింగ్ కాంప్లెక్సులు, సినిమా థియేటర్లు, స్కూల్లు, కాలేజీలు బంద్ చేసారు.

కరోనా వైరస్ మనుషులనే కాదు, వ్యాపారాలను కూడా కుదేల్ చేస్తుంది. కరోనా ఎఫెక్ట్ తో షాపింగ్ కాంప్లెక్సులు, సినిమా థియేటర్లు, స్కూల్లు, కాలేజీలు బంద్ చేసారు. ఇదే కోణంలో నగరంలోని, చుట్టుపక్కన ప్రాంతాలలోని పార్కులను కూడా మూసివేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా రాష్ట్రంలో మరింత వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తతలు తీసుకుంటుంది. తెలంగాణలోనే తొలి కరోనా మృతి సంభవించడం, మరో కరోనా పాజిటికే కేసే నమోదవడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.

ఈ నేపథ్యంలోనే భాగ్యనగరంలో ప్రముఖ పార్కులన్నీ మూసివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు ప్రకటించారు. నగరంలో ఎక్కువగా జనసంచారం ఉండే లంబినీపార్క్‌, ఎన్టీఆర్‌గార్డెన్‌, ఎన్డీఆర్‌ మెమోరియల్‌, సంజీవయ్య పార్క్‌లను ఈ నెల 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నమాన్నారు. వాటితో పాటుగానే మున్సిపాటిల్లో ఉన్నఇందిరా పార్క్‌, పబ్లిక్ గార్డెన్, జలవిహార్‌, ఆక్సిజన్‌ పార్కు జలగం వెంగళరావు పార్కు, నెహ్రూ జువలాజికల్ జూపార్క్‌లను మొదలయిన చిన్న పెద్దా పార్కులను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువగా సభలు నిర్వహించే నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలోని సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేస్తున్నామన్నారు. తెలంగాణతో పాటు, గోవా, ముంబై, కర్నాటక, బీహార్, ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అక్కడ కూడా సినిమా థియేటర్లు, స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories