సీఎంకు ఆ పార్శిల్ పంపిందెవరు..?

సీఎంకు ఆ పార్శిల్ పంపిందెవరు..?
x
Highlights

సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, మంత్రులు, డీజీపీ, ఇతర అధికారుల, సినీ ప్రముఖుల పేర్లతో సికింద్రాబాద్‌ పోస్ట్‌ ఆఫీస్‌కు వచ్చిన పార్శిల్‌ లపై విచారణ కొనసాగుతోంది.

సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, మంత్రులు, డీజీపీ, ఇతర అధికారుల, సినీ ప్రముఖుల పేర్లతో సికింద్రాబాద్‌ పోస్ట్‌ ఆఫీస్‌కు వచ్చిన పార్శిల్‌ లపై విచారణ కొనసాగుతోంది. ఈ నెల 17 వ తేదీన 62 కాటన్‌ బాక్సులు బుక్ చేశారు. రంగంలోకి దిగిన మహాంకాళీ పోలీసులు పార్శిల్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకుని వాటిని FSL కు పంపించారు. అయితే అవి రసాయనాలు కావని కలుషిత నీరు అని FSL ప్రాథమిక రిపోర్ట్‌ ఇచ్చింది.

ఇటు పార్శిల్‌ బాటిల్‌తో పాటు ఓ లెటర్‌ను కూడా మహాంకాళీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓయూ పరిసరాల్లో తామంతా కలుషిత నీటినే తాగుతున్నామంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఉస్మానియా యూనివర్శిటీ పోస్ట్ ఆఫీస్‌ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు. ఓయూ జేఏసీ ఈ పనిచేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories