Top
logo

ఓయూను వెంటాడుతోన్న అధ్యాపకుల కొరత

ఓయూను వెంటాడుతోన్న అధ్యాపకుల కొరత
X
Highlights

ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న యూనివర్శిటీ ఓయూ. ప్రతిష్టాత్మకమైన వర్శిటీగా ఉస్మానియాకు మంచి పేరుంది. ఇందులో...

ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న యూనివర్శిటీ ఓయూ. ప్రతిష్టాత్మకమైన వర్శిటీగా ఉస్మానియాకు మంచి పేరుంది. ఇందులో సీటు సాధిస్తే జీవితంలో స్థిరపడొచ్చని గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీపడి మరీ చేరుతుంటారు. విదేశీ విద్యార్థులు కూడా ఓయూలో చదువుతున్నారు. యూనివర్శిటీకి అంతటి పేరున్నా.. ప్రస్తుతం అధ్యాపకుల కొరత అక్కడి విద్యార్థులను వేధిస్తోంది. పెద్ద సంఖ్యలో అధ్యాపకుల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా భర్తీ కాని పరిస్థితి. దీంతో పలు విభాగాల్లో బోధించేందుకు అధ్యాపకులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

ఓయూలో ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్‌తోపాటు అనేక కోర్సులకు సంబంధించి పెద్ద ఎత్తున అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో తరగతులు జరగని పరిస్థితి ఓయూలో నెలకొంది. ఇంజనీరింగ్‌లో ప్రతిష్టాత్మకమైన ఈసీ కోర్సు బోధించేందుకు ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. ఉర్దూ మాద్యమంలో తొలుత ప్రారంభమైనా ప్రస్తుతం ఉర్దూ డిపార్టుమెంట్‌లో 19 మంది అధ్యాపకులకు గాను.. నలుగురే ఉన్నారు. ఇలా ప్రతి డిపార్టుమెంట్‌లోనూ ఖాళీలు ఉన్నాయి.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఓయూలో అధ్యాపకుల కొరత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఉస్మానియా యూనివర్శిటీలో మొత్తం 1264 పోస్టులకు మంజూరు ఉంటే..682 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే సగానికి పైగా ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇలా ఎన్నో కీలకమైన కోర్సుల్లో పదుల సంఖ్యలో అధ్యాపకులు పోస్టులు ‌ఖాళీగా ఉన్నాయి.

ఓయూలో శతాబ్ధి ఉత్సవాల ప్రారంభం నాటికే ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇంతవరకూ అధ్యాపకులను నియమించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Next Story