రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వాట్సప్ నంబర్ ఎందుకో తెలుసా ?

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వాట్సప్ నంబర్ ఎందుకో తెలుసా ?
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో పెరిగి పోతున్న నేరాల సంఖ్య పెరిగిపోతుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు నేరాల నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలను ఏర్పాటు చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో పెరిగి పోతున్న నేరాల సంఖ్య పెరిగిపోతుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు నేరాల నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలను ఏర్పాటు చేస్తుంది. టెక్నాలజీ పెరగక ముందు సదరు బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేసేవారు. కానీ ఇప్పుడు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించేంత టెక్నాలజీ పెరిగిపోయింది. అంతే కాదు మీకు జరిగిన అన్యాయాలను పోలీసులకు నేరుగా తెలియపరచడానికి ఏకంగా వాట్సప్ నంబరులను కూడా ఏర్పాటు చేసింది పోలీసు యంత్రాంగం. అది కూడా పరిధిలు ప్రకారమం నంబర్లను కేటాయించారు.

ఉదాహరణగా హైదరాబాద్‌ పోలీసు– 9490616555, సైబరాబాద్‌ కాప్స్‌– 9490617444, రాచకొండ కమిషనరేట్‌– 9490617111. రాజధాని భౌగోళికంగా కలిసే ఉన్నా. పరిధుల పరంగా మూడు కమిషనరేట్లు ఉండటంతో వేర్వేరు వాట్సాప్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది కమిషనరేట్లు, 19 పోలీసు జిల్లాల్లోనూ ఏ పరిధికి సంబంధించి నంబరును ఆ పరిధికి కేటాయించారు. దీంతో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడంతో రాష్ట్ర పోలీసు విభాగం ఒకే వాట్సాప్‌ నంబర్‌ అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అది కూడా డీజీపీ కార్యాలయాన్ని కేంద్రంగా తీసుకుని దీన్ని నిర్వహించనున్నారు.

దీంతో బాధితులు వాయిస్‌ రికార్డులు, వీడియోలు, ఫొటోలు వంటివి పోలీసులకు సులువుగా పంపించవచ్చు. ప్రస్తుతం పరిధుల పరంగా ఉన్న నంబర్లకు ఫిర్యాదులు రావడంతో వాటిని మానిటరింగ్ చేయడానికి కూడా ఎక్కువ సిబ్బంధి లేకుండా పోతుంది. డిపార్టుమెంట్ లో సిబ్బంది కొరత వలన బందోబస్తు సందర్భాల్లో ఈ సోషల్‌మీడియా వింగ్‌ సిబ్బందినీ అక్కడకు మోహరిస్తున్నారు. దీంతో ఫిర్యాదుల తీసుకునే వారు తక్కువయ్యారు. కాగా ఒకే నంబరు అమలులోకి వస్తే మూడు షిఫ్టుల్లో పనిచేయడానికి కనీసం పదిమందిని కేటాయిస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఈ పది మంది సిబ్బందే రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదుల్ని సమీక్షిస్తూ సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నంబర్‌.. అదీ డీజీపీ కార్యాలయం కేంద్రంగా అందుబాటులోకి వస్తే ఎటువంటి ఫిర్యాదులనైనా ప్రజలు ధైర్యంగా చేయగలుగుతారని అధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసు నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఈ నెలలో దీన్ని అమల్లోకి తెచ్చి విస్త్రత ప్రచారం కల్పించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories