ఆల్ టైమ్ రికార్డు స్థాయికి ఉల్లిధరలు.. కిలో ఎంతంటే?

ఆల్ టైమ్ రికార్డు స్థాయికి ఉల్లిధరలు.. కిలో ఎంతంటే?
x
Highlights

ఉల్లిధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నిన్న మొన్నటి వరకు వంద రూపాయలున్న కిలో ఉల్లి ధర ఒక్క సారిగా 150 రూపాయలకు పెరిగింది. రోజు రోజుకు...

ఉల్లిధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నిన్న మొన్నటి వరకు వంద రూపాయలున్న కిలో ఉల్లి ధర ఒక్క సారిగా 150 రూపాయలకు పెరిగింది. రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలతో జనాలు ఉల్లి కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. నిత్యం ఉపయోగించే ఉల్లి ధరలు చుక్కలనంటుతుంటంతో మార్కెట్ కు వెళ్లిన వినియోగదారులు కూరగాయలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక చిన్న చిన్న హోటళ్ల మొదలు కొని రెస్టారెంట్లలోనూ ఉల్లి వాడకాన్ని తగ్గించారు. భోజన ప్రియులు డిమాండ్ చేసినా ఉల్లి వడ్డించలేమనే చెబుతున్నారు. ఉల్లికి ప్రత్యామ్నాయంగా కీరా, క్యాబేజీ, క్యారెట్ ముక్కలతో సరిపెడుతున్నారు.

పెరుగుతున్న ఉల్లి ధరలతో హైదరాబాద్ మార్కెట్ కు దిగుమతి తగ్గిపోయింది. హైదరాబాద్ కు సాధారణ రోజుల్లో రోజుకు 150 నుంచి 170 లారీలో ఉల్లిగడ్డ దిగుమతి అయ్యేది. కానీ ప్రస్తుతం మహారాష్ర్టలో ఉల్లి కొరత కారణంగా నగరానికి కనీసం 30 లారీల లోడు రాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మహారాష్ర్ట నుంచి ఒకే ఒక్క లారీ లోడు 4 వేల 14 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే మలక్ పేట మార్కెట్ కు వచ్చింది. వ్యాపారులు అంది వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అధిక ధరలకు ఉల్లి విక్రయాలు జరుపుతున్నారు. ఉల్లి ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంచినీటి కోసం కుళాయిల వద్ద యుధ్దాలు చేసే మహిళలు ఇప్పుడు ఉల్లి కోసం కుస్తీ పడుతున్నారు. సబ్సిడీతో ప్రభుత్వం రైతు బజార్లలో విక్రయిస్తున్న ప్రజలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఉల్లి కోసం మహిళలు తెల్లవారుజాము నుంచి రైతు బజార్లలో బారులు తీరుతున్నారు. తమ వంతు వచ్చే వరకు ఉల్లి దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.

మరో వైపు పెరిగిన ఉల్లి ధరలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తుంటే వినియోగదారులు విలవిలలాడి పోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఉల్లి కోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా జనం రైతు సేవా కేంద్రాలకు ఎగబడుతున్నారు. పెరుగుతున్న ఉల్లి ధరకు కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సబ్సిడీ ఉల్లి వినియోగదారులకు ఏ మాత్రం సరిపోవడం లేదు అంటున్నారు రైతు సేవ కేంద్రం సిబ్బంది. వచ్చిన స్టాక్ ను వచ్చినట్లే అమ్మేస్తున్నామని చెబుతున్నారు. వినియోగదారుల డిమాండ్ మేరకు స్టాక్ రావడంలేదని వాపోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories