ఘాటెక్కిన ఉల్లి ధర.. జనం లబోదిబో..

ఘాటెక్కిన ఉల్లి ధర.. జనం లబోదిబో..
x
Highlights

కూరగాయల్లో మహారాణిగా పిలిచే ఉల్లి ఘాటెక్కింది. వారం రోజులుగా ఉల్లి ధరలు కొండెక్కుతున్నాయి. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి వాసన చూద్దామన్నా.. ధర అందనంత పైకి ఎగబాకుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి ధర 50కి చేరువలో ఉంది.

కూరగాయల్లో మహారాణిగా పిలిచే ఉల్లి ఘాటెక్కింది. వారం రోజులుగా ఉల్లి ధరలు కొండెక్కుతున్నాయి. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి వాసన చూద్దామన్నా.. ధర అందనంత పైకి ఎగబాకుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి ధర 50కి చేరువలో ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హోల్ సేల్ వ్యాపారులు చెబుతుండటంతో వినియోగదారుల గుండెల్లో ఉల్లి మంట గుబులు రేపుతోంది.

పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి అవసరమైన మేర సరఫరా లేకపోవడతో ఉల్లిధరలు అమాతం పెరిగాయి. పంట చేతికొచ్చి రైతులు మార్కెట్ కు అమ్మకానికి తెచ్చినప్పుడు కిలో 5 లోపు పలికిన ధర.. ఇప్పుడు ఏకంగా కిలో 50 రూపాయలకు చేరుకుంది. పొరుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా.. దిగుబడి తగ్గింది. ఫలితంగా మన రాష్ట్రానికి అవసరమైన మేర సరఫరా కాకపోవడంతో.. డిమాండ్ పెరిగి ధర పెరుగుతోందని మార్కెట్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఉల్లి వ్యాపారులు కృత్తిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. హోల్ సెల్ లో ఉల్లి క్వింటాలు 3 నుంచి 4 వేలు పలుకుతుండగా.. కిరాణాషాపుల్లో కిలో 50 నుంచి 60 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఉల్లి ధర బంగారంతో పోటీ పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ధరలను నియంత్రించి పేదలకు అందుబాటులోకి తేవాలని వినియోగదారులు కోరుతున్నారు.

నిజామాబాద్ మార్కెట్ కు మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి అవుతుంది. ఐతే అక్కడ కురిసిన వర్షాలతో.. దిగుబడి తగ్గి సరఫరా ఆశించిన స్దాయిలో జరగడం లేదు. ఫలితంగా కొరత ఏర్పడి 10రోజుల వ్యవధిలో కిలోకు 20 రూపాయలు ధర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో ఉల్లి 40 నుంచి 50 వరకు పలుకుతుంది. జిల్లాలో రోజుకు 40 టన్నుల ఉల్లిగడ్డలు వినియోగిస్తారనే అంచనా ఉంది. రోజుకు 3 నుంచి 4 లారీల ఉల్లి దిగుమతి చేసుకుంటారు. ఐతే మహారాష్ట్ర నుంచి ఆశించిన స్ధాయిలో సరఫరా లేక ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మరో మూడు నెలల వరకు ఉల్లిఘాటు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

ఒకప్పుడు ఉల్లి కోస్తున్నప్పుడు కన్నీళలు తెప్పించేవని..ప్రస్తుతం కొనే సమయంలోనే కన్నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ఉల్లి ధరను అందుబాటులోకి తేవాలని రైతు బజార్ల ద్వార విక్రయించాలని డిమాండ్ చేస్తున్నారు. ధర పెరగడం వల్ల గిరాఖీ తగ్గిందని చెబుతున్నారు. మహారాష్రలో సంభవించిన అతివృష్టి.. కర్నూలులో చోటుచేసుకున్న అనావృష్టి.. ఉల్లి పై ప్రభావం చూపెట్టింది. పంట మళ్లీ చేతికొచ్చే వరకు ఇదే పరిస్ధితి కొనసాగే అవకాశం ఉంది. ధరలు మరింత పెరగకుండా.. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories