Top
logo

జడ్చర్లకు సమీపంలో కారు బోల్తా: ఒకరి మృతి, నలుగురికి గాయాలు

జడ్చర్లకు సమీపంలో కారు బోల్తా: ఒకరి మృతి, నలుగురికి గాయాలు
X
Highlights

జాతీయ రహదారులు రోజుకో రోడ్డు ప్రమాదంతో రక్త సిక్తంగా మారుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్నిట్రాఫిక్ నిబంధనలు పెట్టినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల ఎకువగా అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణం అవుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వాళ్ళ ఎన్నో వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

జాతీయ రహదారులు రోజుకో రోడ్డు ప్రమాదంతో రక్త సిక్తంగా మారుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్నిట్రాఫిక్ నిబంధనలు పెట్టినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణం అవుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వాళ్ళ ఎన్నో వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

ఇదే నేపధ్యంలో నిన్నటికి నిన్న షాద్‌నగర్ మండలం బూర్గుల టోల్‌గేట్ సమీపంలో కారు బోల్తా పడి ముగ్గురు మృతి చెంది, నలుగురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మరువక ముందే జడ్చర్లకు సమీపంలోని తిమ్మాపూర్ వద్ద బెంగళూరు నుంచి మేడ్చల్ వస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్ మృతి చెందగా, మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఇప్పటికైనా వాహనాలను నడిపించే డ్రైవర్ లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని పోలీసులు కోరుకుంటున్నారు.

Next Story