నేటినుంచి నుమాయిష్ పునఃప్రారంభం

నేటినుంచి నుమాయిష్ పునఃప్రారంభం
x
Highlights

ఏడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన నుమాయిష్ చరిత్రలోనే గత బుధవారం దుర్దినం. ఓ స్టాల్‌లో ఎగిసిపడ్డ మంటలు దావానాలంలా వ్యాపించాయి. సుమారు 300 స్టాళ్లు...

ఏడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన నుమాయిష్ చరిత్రలోనే గత బుధవారం దుర్దినం. ఓ స్టాల్‌లో ఎగిసిపడ్డ మంటలు దావానాలంలా వ్యాపించాయి. సుమారు 300 స్టాళ్లు కాలిబూడిదయ్యాయి. ప్రాణనష్టం తప్పినా, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు సర్వం కోల్పోయారు. దీంతో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో నుమాయిష్ పునఃర్నిర్మాణం జరిగింది. ఇవ్వాల్టి నుంచి నుమాయిష్ మళ్లీ ప్రారంభమౌతోంది. మధ్యాహ్నం నుంచి సందర్శకులను అనుమతిస్తారు. కాలిపోయిన స్టాల్స్ స్థానంలో కొత్త వాటిని మరో రెండు రోజుల్లో నిర్మించి ఇస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ హామీ ఇచ్చింది. ఘటనపై కమిటీని ఏర్పాటు చేశామని.. నివేదిక వచ్చిన వెంటనే పరిహారం అందిస్తామన్నారు. నుమాయిష్ ఈ నెల 15తో ఎగ్జిబిషన్‌ ముగియాల్సి ఉంది. అయితే అగ్నిప్రమాదం కారణంగా ఎగ్జిబిషన్‌ మరో నాలుగు ఐదు రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories