పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
x
Kaloji Narayanarao University of Health Sciences
Highlights

రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో పీజీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్ విడుదయింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో పీజీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్ విడుదయింది. ఈ నోటిఫికేషన్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. కాగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇక ఇప్పటికే యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలలతో పాటు నిమ్స్ లో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రాల పరిశీలనను పూర్తి చేసి, 3వ తేది ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ జాబితాను కూడా విడుదల చేశారు.

దాంతో పాటుగానే సోమవారం సీట్ల వివరాలను కళాశాల వారీగా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ నెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్దేశిత వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఆప్షన్లను నమోదు చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థులు మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునే వారు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories