డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసుల అతి..సీఎస్, డీజీపీలకు కోర్టు నోటీసులు

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసుల అతి..సీఎస్, డీజీపీలకు కోర్టు నోటీసులు
x
Highlights

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో...

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారి సమాచారాన్ని వారు పని చేస్తున్న కంపెనీలకు సమాచారం అందిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులు, కోర్టు ఆలోచించాలని కోరుతూ వంశీకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పాల్గొనడం తప్పే అయినా సంస్థలకు సమాచారం అందిస్తున్నారు. దీనితో ఆయా సంస్థల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారికి నోటీసులందుతున్నాయి. సంస్థలో తమ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారు కౌన్సిలింగ్‌కు హాజరవుతున్నారు. కోర్టుకు, జైలుకు వెళ్లి వస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. వాహనాలను తిరిగి అందించకపోవడం వల్ల అవి ఎండకు ఎండి వానకు తడుస్తూ పాడైపోతున్నాయి. తర్వాత ఆ వెహికిల్స్ వాడుకోవడానికి పనిరాకుండా పోతున్నాయి.

డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారి సంస్థలకు సమాచారం అందించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను హై కోర్టు విచారించింది. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీకి కోర్టు నోటీసులు జారీచేసింది. జులై 22కు కేసు విచారణను వాయిదా వేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories