నగరపాలక సంస్థలో టాయిలెట్లు కరువు..

నగరపాలక సంస్థలో టాయిలెట్లు కరువు..
x
Highlights

రాష్ట్రంలోనే పేరున్న మూడో నగరం కరీంనగర్. ఈ నగరంలోని నగరపాలక సంస్థలో సుమారుగా 300కు పైగానే ఉంటారు. అంతే కాదు ప్రతి రోజు వేరు వేరు అవసరాలతో వెయ్యికి మందికి పైగా కార్యాలయానికి వచ్చారు.

రాష్ట్రంలోనే పేరున్న మూడో నగరం కరీంనగర్. ఈ నగరంలోని నగరపాలక సంస్థలో సుమారుగా 300కు పైగానే ఉంటారు. అంతే కాదు ప్రతి రోజు వేరు వేరు అవసరాలతో వెయ్యికి మందికి పైగా కార్యాలయానికి వచ్చారు. ఉదయం 10 గంటలకు వచ్చిన సిబ్బంది వారి పనులు అయ్యేంత వరకు అంటే సాయంత్రం వరకు ఇంటికి వెళ్తారు. అంటే వారు రోజంగా అక్కడే ఉంటారు. దీంతో వారిని టాయిలెట్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి రోజు వేయిమందికి పైగా తిరిగే నగరపాలక సంస్థలో కేవలం నాలుగు మరుగుదొడ్లు మాత్రమే ఉండడంతో, సిబ్బంది, కార్యార్ధులు ఇబ్బందుల పాలవుతాడు. ఈ విషయం గురించి సిబ్బంది, ప్రజలు ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాథుడే లేడు.

దీంతో ఇక్కడ విధులను నిర్వహిస్తున్న 150 మందికిపైగా మహిళా ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరు మాత్రమే కాకుండ ప్రతి రోజు సుమారు 200మందికి పైగా మహిళలు కార్యాలయానికి వస్తుంటారు. వీరందరి మధ్యలో ఉన్న టాయిలెట్స్‌ కేవలం రెండు మాత్రమే. ఆ టాయిలెట్స్ కూడా సమావేశం మందిరంలో ఉండడంతో వారు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇక పోతే ప్రస్తుతం కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో 3లక్షలకు పైగా జనాభా ఉన్నారు. వారు మాత్రమే కాకుండా తెల్లవారు జామునుంచి చుట్టుపక్కన వారు నగరానికి ప్రతిరోజు లక్ష మందికి పైగా వస్తుంటారు. కానీ ప్రస్తుతం నగరంలో 17 సులభ్‌ కాంప్లెక్స్‌లు అందుబాటులో ఉండడంతో అధికారులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో మరో 28 నిర్మించడానికి స్థలాలు గుర్తించారు. ఇవి మాత్రమే కాకుండా మరో ఎనిమిది మరుగుదొడ్లను స్మార్ట్‌సిటీలో భాగంగా నిర్మించనున్నారు. ఇక ఈ నెల 11వ తేదీన మంత్రి గంగుల ఎస్సారార్‌ కళాశాల వద్ద స్మార్ట్‌సిటీ టాయిలెల్స్‌ను ప్రారంభించారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories