యురేనియం తవ్వకాలపై మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన

యురేనియం తవ్వకాలపై మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన
x
Highlights

యురేనియం తవ్వకాలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, ఇవ్వబోదని స్పష్టం చేశారు...

యురేనియం తవ్వకాలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, ఇవ్వబోదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్బంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. యూరేనియం నిక్షేపాలు ఉన్నప్పటికీ తవ్వకాలను అనుమతి ఇవ్వబోమన్నారు. అటవీ ప్రాంతంలో రోడ్లు వేయ రాదని ఆదేశించారు. కొంత మంది రాజకీయ నాయకులు అత్యంత నీచంగా, భాద్యత రాహిత్యంగా యురేనియం విషయంలో మాట్లాడుతున్నారు. నిజానికి యురేనియం తొవ్వకాల విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఇప్పటి కేంద్ర ప్రభుత్వ పరిదిలోని ఎఎండీ పనులు చేస్తోంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ పర్యావరణ ప్రేమికుడు.. అటవిని కూల్చరు. 2009లో తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తవ్వుతున్నది బీజేపీ అని మేము చెప్పవచ్చు.. కానీ, మేము చెప్పుము. యురేనియం తవ్వకాలపై సీఎంతో చర్చించి అధికారికంగా తీర్మానం పెట్టేలా ప్రయత్నం చేస్తాము. మేము తప్ప చేయం.. చెయ్యబోం'' అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories