Top
logo

తెలంగాణలో రైతులకు న్యాయం జరగడం లేదన్న వీహెచ్

తెలంగాణలో రైతులకు న్యాయం జరగడం లేదన్న వీహెచ్
Highlights

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి న్యాయం జరగడంలేదని వీహెచ్ తెలిపారు. రెవెన్యూ విభాగంలో ఏవిధమైనా పనులు జరగాలన్నా రైతులు రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యం మంత్రి కేసీఆర్ పాలనపై సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యలను చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎలాంటి ఆత్మహత్యలు, రైతు చావులు ఉండవని కేసీఆర్ అన్నారని, కానీ ఆయన పాలనలోనే ఆయన చెప్పిన దానికి భిన్నంగా వ్యవహారం నడుస్తుందని విమర్శించారు. ప్రభుత్వం పరిపాలించే తీరుతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వీహెచ్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి న్యాయం జరగడంలేదని ఆయన తెలిపారు. రెవెన్యూ విభాగంలో ఏవిధమైన పనులు జరగాలన్నా రైతులు రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అయినప్పటికీ వారి సమస్యలు తీరడంలేదని వారు తెలిపారు. రైతులకు భూమిపైన హక్కు ఉన్నప్పటికీ, కొన్నేండ్లుగా వారు కాస్తులు కడుతున్నా వారికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంలేదని వారు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు వారి డిమాండ్లను సాధించుకోవడానికి చేస్తున్న సమ్మెను ఆపడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిపాలనలో మార్పులు రావాలని వారు కోరారు.Next Story


లైవ్ టీవి