మన విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకునే దుర్గతి పట్టకూడదని జగన్, నేను నిశ్చయించుకున్నాం: కేసీఆర్

మన విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకునే దుర్గతి పట్టకూడదని జగన్, నేను నిశ్చయించుకున్నాం: కేసీఆర్
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ సమావేశం నిర్వహించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మీడియా ముఖంగా క్యాబినెట్ భేటీ వివరాలు తెలియజేశారు. ఈ...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ సమావేశం నిర్వహించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మీడియా ముఖంగా క్యాబినెట్ భేటీ వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, యువకుడు, ఉత్సాహవంతుడు అయిన జగన్ ఏపీలో సీఎం అయ్యారని, ఆయన తన రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నీటిని అందించాలని దృఢంగా నిర్ణయించుకున్నారని తెలిపారు. ముఖ్యంగా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని మెట్టభూములకు నీళ్లు తీసుకెళ్లాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారని వివరించారు.

తెలంగాణలో కాళేశ్వరం ఎలా పూర్తయిందో, ఏపీలో కూడా అలాగే కొన్ని ప్రాజక్టులు పూర్తిచేసుకోవాలని జగన్ చెప్పారని, భేషజాలు పనికిరావన్న అభిప్రాయం జగన్ వైఖరి ద్వారా అర్థమవుతోందని కేసీఆర్ అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీ నీటిపారుదల మంత్రిత్వ శాఖ నుంచి ఓ బృందం హైదరాబాద్ వస్తోందని, తాము కూడా విజయవాడ వెళ్లి జలాల విషయంలో చర్చలు జరుపుతామని వెల్లడించారు. అవసరమైతే పరిశీలన బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి నివేదికలు రూపొందిస్తాయని తెలిపారు.

కృష్ణా, గోదావరికి సంబంధించి 4800 టీఎంసీల నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు పుష్కలంగా వాడుకోవడానికి అవకాశం ఉందని, ఇకమీదట తెలుగు రాష్ట్రాల వివాదాల్లో కేంద్రం జోక్యం చేసుకునే దుర్గతి పట్టకూడదని తానూ, ఏపీ సీఎం జగన్ నిశ్చయించుకున్నామని కేసీఆర్ వెల్లడించారు. గతంలో అపార్థాలు, కయ్యాలు, కీచులాటల ద్వారా అంతిమంగా తెలుగు ప్రజలు నష్టపోయారని తెలిపారు. ఇకమీదట ఆ సమస్య ఉండబోదని, అందుబాటులో ఉన్న సుమారు ఐదువేల టీఎంసీల నీళ్లు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికి తీసుకెళ్లాలన్నది తమ ప్రణాళిక అని స్పష్టం చేశారు. రాబోయే రెండు మూడేళ్లలో దాని ఫలితాలు కనిపిస్తాయని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories