కరోనా ఎఫెక్ట్ : సెక్రెటేరియట్‌లో విజిటర్స్‌కు నో ఎంట్రి

కరోనా ఎఫెక్ట్ : సెక్రెటేరియట్‌లో విజిటర్స్‌కు నో ఎంట్రి
x
Highlights

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడులన్న చర్యల్లో భాగంగా సెక్రటేరియట్ తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకుల రాకను ఆపివేస్తుంది. ఎవరికైనా...

రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడులన్న చర్యల్లో భాగంగా సెక్రటేరియట్ తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకుల రాకను ఆపివేస్తుంది. ఎవరికైనా అత్యవసర పనులు ఉంటే వారు ఆ విషయాన్ని ముందుగానే సంబంధిత అధికారులకు తెలియజేసీ లోపలికి వెల్లేందుకు అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అంతే కాదు సచివాలయ ఉద్యోగులందరికీ శానిటైజర్ లు, మాస్క్‌లు ఉచితంగా అందజేస్తున్నారు. సందర్శకులు, ఉద్యోగులు వాడే శౌచాలయాలు, లిఫ్ట్‌లు, తలుపులు, బీరువాలు వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. సెక్రెటేరియట్ లో హౌస్‌కీపింగ్‌ సిబ్బందిని పెంచి పరిసరాలు శుభ్రంగా ఉంచుతున్నారు. ఇక ప్రతి రోజూ ఎంతో మంది తమ పనులు పూర్తు చేసుకోవడం కోసం సచివాలయానికి వస్తూ, వెలుతుంటారు. కాగా సచివాలయం ఎంట్రెన్స్‌లో వచ్చిన వారిని పరీక్షించేందుకు థర్మల్‌ స్కానర్‌లను ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఎవరైనా కరోనా అనుమానితులు ఉంటే వారికి ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసి తగిన చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు.

కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారు వ్యాధి లక్షణాలను దాచిపెట్టడం ప్రమాదమని వైద్య నిపుణులు, ప్రభుత్వాధికారులు హెచ్చరిస్తున్నారు. తమను ఇతరులతో కలవకుండా క్వారెంటైన్‌ చేస్తారని భయపడి కొందరు వ్యక్తులు వ్యాధి లక్షణాలను దాచిపెడుతున్నారు. ఎయిర్‌పోర్టుల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ నుంచి తప్పించుకోవడం కోసం విమానం దిగే ముందు పారాసిటమాల్‌ బిళ్లలు వేసుకుంటున్నారు. మరికొందరైతే క్వారెంటైన్‌ నుంచి పారిపోతున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదని.. దీనివల్ల మీకు మీ ఆత్మీయులకు కూడా ప్రమాదమని... ఇది ఎంతమాత్రం సరికాదని.. దీనివల్ల మీకు మీ ఆత్మీయులకు కూడా ప్రమాదమని వైద్య నిపుణులు, ప్రభుత్వాధికారులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories