ప్రేమజంటలకు షాక్.. ఇక నుంచి అక్కడ నో ఎంట్రీ..

ప్రేమజంటలకు షాక్.. ఇక నుంచి అక్కడ నో ఎంట్రీ..
x
Highlights

"పార్కు" ఇదో ప్రశాంతమైన స్థలం. పార్కుల్లోకి నిత్యం వందలాదీ మంది వస్తుంటారు. పార్కులు సందర్శించే వారిలో చిన్న, పెద్ద అని తెడా లేకుండా పార్కుల్లోకి ప్రవేశిస్తుంటారు. సాయంత్రమైతే చాలు మహా నగరవాసులు పార్కుల్లోనే సేదతీరుతారు.

"పార్కు" ఇదో ప్రశాంతమైన స్థలం. పార్కుల్లోకి నిత్యం వందలాదీ మంది వస్తుంటారు. పార్కులు సందర్శించే వారిలో చిన్న, పెద్ద అని తెడా లేకుండా పార్కుల్లోకి ప్రవేశిస్తుంటారు. సాయంత్రమైతే చాలు మహా నగరవాసులు పార్కుల్లోనే సేదతీరుతారు. తలిదండ్రులు వారివారి పిల్లలతో పార్కులో సరదాగా గడుపుతుంటారు. ఇక ఇదే పార్కులోకి ప్రేమ జంటలు రావడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరాన 92 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంజీవయ్య పార్కులోకి ప్రేమపక్షుల ప్రవేశాన్ని నిషేధించింది. ఇప్పటి నుండి ఈ పార్కు సంజీవయ్య చిల్ట్రన్ పార్కుగా మారింది. ఈ పార్కులోకి కేవలం 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షులతో వస్తేనే పార్కులోకి ప్రవేశం కల్పిస్తారు. ఇక 14 ఏళ్లు దాటిన వారికి ఈ పార్కులో నో ఎంట్రీ. టికెట్ రేట్లను కూడా రూ.20 నుంచి రూ.10కి తగ్గిస్తున్నామని తెలిపారు.

అయితే చాలా మంది పర్యటకులు సంజీవయ్య పార్కును సందర్శిస్తుంటారు. వీరితో పాటు చిన్న పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులు వస్తుంటారు. కాగా, కుటుంబ సభ్యులకు ఈ పార్కులో ఉండే ప్రేమ జంటలు చేసే అసభ్యకర చేష్టలు చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పార్కులోకి రోజుకూ వందలాదీ మంది ప్రేమికుల జంట ప్రవర్తన శృతి మించుతున్నారు. అయితే ఇంతకాలం కేవలం ఆదాయం కోసమే అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. అయితే ఇటీవల బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ ఓఎస్‌డీగా బాధ్యతలు చేపట్టిన రాంకిషన్‌ ట్రెండ్ సెగ్ చేశారు. ఇక నుండి ప్రేమజంటలకు ప్రవేశం లేదని చెప్పేశారు. ఇక సంజీవయ్య పార్కుతో పాటుగా హెర్బల్‌ పార్క్, బటర్‌ ఫ్లై పార్కు, రోజ్‌ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మారిస్తే బాగుంటుందన్న రాంకీషన్ ప్రతిపాదనకు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ ఓకే చెప్పారు. ఇక నుండి చిన్నారుల్లో సైన్స్‌పై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించడానికి ఈ మార్పు చాలా దోహదం కానుంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సర్కార్ బడుల విద్యార్థులు బృందంగా వస్తే ఈ పార్కులు ఇక నుంచి ఉచిత ప్రవేశం కల్పిస్తారు. మొత్తానికి ప్రేమ జంటకు చెక్ పెడుతూ సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మారనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories