Top
logo

రైతుల రిలే నిరాహారదీక్షలు..కంటతడిపెట్టిన తహసీల్దార్

రైతుల రిలే నిరాహారదీక్షలు..కంటతడిపెట్టిన తహసీల్దార్
Highlights

నిజామాబాద్ జిల్లా రెంజల్ తహసీల్దార్ కంటతడి పెట్టారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నత అధికారులు సహకరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లా రెంజల్ తహసీల్దార్ కంటతడి పెట్టారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నత అధికారులు సహకరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెంజల ఎమ్మార్వో ఆఫీసు ఎదుట రైతుల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. తాము సాగు చేసుకుంటున్న భూములకు పాస్ బుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా రెంజల్‌ మండల పరిధిలోని 309 ఎకరాలను 127 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకై కొత్త పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే రైతులు సాగు చేసుకుంటున్న భూమి వక్ఫ్‌ బోర్డు పరిధిలో ఉన్న కారణంగా పాస్‌ పుస్తకాలు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అధికారుల కఠిన వైఖరితో మనస్తాపం చెందిన రైతులు నిరాహార దీక్షకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తడంతో రెంజల్‌ తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌ కంటతడి పెట్టారు.లైవ్ టీవి


Share it
Top