Hyderabad: కోర్టుకు హాజరైన కవిత... మార్చి 19కి కేసు వాయిదా

Hyderabad: కోర్టుకు హాజరైన కవిత... మార్చి 19కి  కేసు వాయిదా
x
కవిత (ఫైల్ ఫోటో)
Highlights

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో ఏండ్ల నుంచి నాయకులు అలుపెరగని పోరాటాలు సాగించారు. ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేసారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో ఏండ్ల నుంచి నాయకులు అలుపెరగని పోరాటాలు సాగించారు. ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేసారు. కొంత మంది నాయకులు వారి పదవులకు రాజీనామాలు చేసారు. కొంత మంది జైలుకు కూడా వెళ్లారు. ధర్నాలు రాస్తరోకోలు ఇలా ఎన్నో త్యాగాలను చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఈ సమయంలో ఎంతో మంది విద్యార్థుల మీద, నాయకుల మీద కేసులు నమోదయ్యారు. ఇప్పటి వరకు కూడా ఆ కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి.

ఈ కోణంలోనే తెలంగాణ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసారు. దీంతో అక్కడా ఉపఎన్నికలకు రంగం సిద్దం చేసారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు మద్దతుగా 2010లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, నిజామాబాద్ పట్టణంలో ఆందోళనలు నిర్వహించారు. కాగా రాష్ట్రంలో సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్నప్పుడు నిజామాబాద్ ఎస్పీ ఆఫీసు ఎదురుగా ధర్నా చేసినందుకుగాను కవిత మీద ఐపీసీ 341, 188, సెక్షన్లు కింద పోలీసులు కేసును నమోదు చేశారు.

అప్పడు నమోదు చేసిన కేసులకు గాను ఈ రోజున నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం, స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు హాజరు కావాలంటూ ఇటీవల సమన్లు జారీ చేసింది. దీంతో మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు ఈ రోజున హాజరయ్యారు. అనంతరం ఈ కేసును విచారించిన మొదటి అదనపు న్యాయమూర్తి, వ్యక్తిగత పూచీకత్తు పదివేల రూపాయలు బాండ్ సమర్పించాలని, తిరిగి 19మార్చ్ నాడు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories