సూపర్ కలెక్టర్.. సైకిల్ పై సామాన్యుడి లా..

సూపర్ కలెక్టర్.. సైకిల్ పై సామాన్యుడి లా..
x
కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Highlights

కొన్ని సినిమాల్లో పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి నేరుగా వారే ప్రజల్లోకి వెళ్లి సమస్యలను తెసుకుంటారు.

కొన్ని సినిమాల్లో పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి నేరుగా వారే ప్రజల్లోకి వెళ్లి సమస్యలను తెసుకుంటారు. అన్యాయాలకు పాల్పడుతున్న వ్యక్తులను సస్పెండ్ చేస్తారు. అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నిజ జీవితంలో కూడా అలాంటి అధికారి కానీ, అలాంటి నాయకుడు కానీ ఉంటే బాగుండును అని అనుకుంటుంటాం కదూ..

అందరూ అనుకున్న ఆ కల ఒక చోట నిజమైంది. సామాన్య ప్రజలు ఆలోచించినట్టుగానే ఒక కలెక్టర్ ఆలోచించారు. ప్రజల సమస్యలను నేరుగా తానే తెలుసుకోవాలనుకున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా సైకిల్ మీద సర్కార్ దవాఖానాకు కెళ్లారు. ఆస్పత్రిలో ఉన్న పరిస్థితుల్ని గమనించారు. 'జలధార'వద్దకు వెళ్లి లీటర్‌ నీటికి ధర ఎంత? అని అడిగి అక్కడి పరిస్థితుల్ని ఆరా తీసారు. వైద్యుల కోసం మెట్ల మీద కూర్చుని ఎదురు చూస్తున్న రోగుల వద్దకు, వృద్ధుల వద్దకు వెళ్లి తానూ ఆ మెట్ల మీద కూర్చున్నారు. వైద్యులు ఏ విధంగా వైద్యం అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఓపీ విభాగం వద్ద రోగులతో కలిసిపోయి వారితో మాటలు కలిపారు. అక్కడి నుంచి మెళ్లిగా గైనిక్, జనరల్‌, ఆపనేషన్ థియేటర్ ఇలా ఒక్క టేమిటి అన్ని విభాగాలను సందర్శించారు. అయినప్పటికీ అక్కడ ఎవరూ గుర్తుపట్టలేదు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు.

ఒక గంట తర్వాత ఆస్పత్రి యాజమాన్యానికి ఎలా సమాచారం అందిందో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. వచ్చిన వ్యక్తి సామాన్య విజిటర్ కాదని, కలెక్టర్‌ అని తెలియడంతో వైద్యులు, సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆస్పత్రి ఆవరణ మొత్తం హడావుడిగా ఉరుకులు పరుగులు పెట్టారు. వైద్యుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఇక రోగులు, వారి బంధువులు ఇప్పటి వరకూ తమతో కలిసి తిరిగి మాట్లాడిన వ్యక్తి కలెక్టర్‌ అని తెలిసి షాక్ అయ్యారు. చూస్తుంటే ఇదీ ఒక సినిమాలాగే ఉంది. మరి డాక్టర్లకు ఇంత మంచి ట్విస్ట్ ఇచ్చిన ఆ కలెక్టర్ ఎవరు ఏంటి పూర్తి వివరాల్లోకెళదామా..

నూతనంగా నిజామాబాద్‌ జిల్లాకు బదిలీపై వచ్చిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్కార్ట్ లేకుండా సాదా సీదా వ్యక్తిలాగా తాను బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి సైకిల్‌పై బయలుదేరాడు. ఉదయం ఎనిమిది గంటలకల్లా జిల్లా కేంద్రంలోకి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న జలధార కేంద్రానికి వెళ్లి రెండు రూపాయలకు లీటరు మంచినీరు అమ్మడాన్ని గుర్తించారు.

రూపాయికే లీటరు నీటిని విక్రయించాలి కదా అని కలెక్టర్ ప్రశ్నించగా నిర్వాహకుడు నిర్లక్ష్యంగా రెండు రూపాయలే తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అన్నట్టుగా సమాధానమిచ్చాడు. అంతే వెంటనే కలెక్టర్ జలధార కేంద్రాన్ని సీజ్ చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రిలోపలికి వెళ్లి రోగుల సమస్యలను, వైద్యం గురించి ఆరా తీసారు. అక్కడినంచి అక్కడి నుంచి గైనిక్ విభాగానికి చేరుకుని బాలింతలతో మాట్లాడారు.

ఆస్పత్రిలో అక్కడక్కడ కూర్చుని ఉన్న రోగులతో కాస్త సమయాన్ని గడిపి వివరాలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను తనిఖీ చేసారు. నర్సులు, సెక్యూరిటీ గార్డులు, వార్డు బాయ్‌లతో మాట్లాడారు. మందుల షాపులను తనిఖీ చేసారు. కొద్ది సేపటికి ఆస్పత్రి సిబ్బందికి కలెక్టర్ వచ్చరు అని తెలియగానే హడావుడి చేసారు. అనంతరం మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. హాజరు లిస్టును చెక్ చేసారు. విధుల్లో గైర్హాజరైన 111 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఇదే విధంగా అన్ని జిల్లాల కలెక్టర్ లు ఉంటే ప్రతిజిల్లా ముందంజలో ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories