మున్సిపల్ ఎన్నికలు: Nizamabad లో 10 మంది మహిళలు అరెస్ట్

మున్సిపల్ ఎన్నికలు: Nizamabad లో 10 మంది మహిళలు అరెస్ట్
x
Highlights

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ లో పోలీసులు 10 మంది మహిళను అదుపులోకి తీసుకున్నారు. మాలపల్లి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదిమంది మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా, దొంగఓటు వేసేందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. పట్టుబడ్డ మహిళలంతా డిచ్‌పల్లి నుంచి ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు.

నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ బైక్ ర్యాలీ చేపట్టడంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే బైక్ ర్యాలీ చేపట్టారంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

నిజామాబాద్ లోని చంద్రశేఖర్ కాలనీ 41వ డివిజన్ లో టిఆర్ఎస్, బిజెపిల నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త వాతారవణం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీఛార్జీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories