Top
logo

ఎల్.బి.నగర్‌లో విషాదం..లిఫ్ట్‌లో ఇరుక్కొని చిన్నారి మృతి

ఎల్.బి.నగర్‌లో విషాదం..లిఫ్ట్‌లో ఇరుక్కొని చిన్నారి మృతి
Highlights

అప్పటివరకు ఆడుతూపాడుతూ సందడి చేసిన చిన్నారిని మృత్యువు లిఫ్ట్ రూపంలో బలితీసుకుంది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ...

అప్పటివరకు ఆడుతూపాడుతూ సందడి చేసిన చిన్నారిని మృత్యువు లిఫ్ట్ రూపంలో బలితీసుకుంది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. ఓ ఫ్లాటులో నివసిస్తున్న చంద్రశేఖర్ కూతురు లాస్య సెలవులు కావడంతో పిల్లలతో కలిసి ఆడుకుంటూ లిఫ్ట్‌ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ తలుపులు మూసుకుపోవడంతో అందులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. చిన్నారి ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తించిన లాస్య తల్లిదండ్రులు పరుగు పరుగున ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఆ చిట్టితల్లి మృతి చెందింది.

పాప ఇక రాదన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటివరకు అల్లరి చేసిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. పాప కోసం గుండెలు పగిలేలా ఏడ్చారు ఆ తల్లిదండ్రులు. చుట్టుపక్కల వాళ్లు ఎంత ఓదార్చుతున్నా వాళ్ల కన్నీటి ఆపడం ఎవరి వల్లా కాలేకపోయింది. లాస్య సరిగ్గా డోర్ పడకముందే లోపలికి వెళ్లి బటన్ నొక్కి ఉంటుందని స్థానికులు పోలీసులు భావిస్తున్నారు.

Next Story