మహబూబ్‍నగర్‍ జిల్లాలో చర్చనీయాంశమైన ఉపాధ్యాయుల సస్పెన్షన్

మహబూబ్‍నగర్‍ జిల్లాలో చర్చనీయాంశమైన ఉపాధ్యాయుల సస్పెన్షన్
x
Highlights

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులపై మహబూబ్‍ నగర్‍ జిల్లా కలెక్టర్ కొరఢా ఝుళిపించారు. పాఠశాల సమయానికి సకాలంలో రాని 9 మంది...

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులపై మహబూబ్‍ నగర్‍ జిల్లా కలెక్టర్ కొరఢా ఝుళిపించారు. పాఠశాల సమయానికి సకాలంలో రాని 9 మంది ఉపాధ్యాయుల సస్పెండ్ కు ఆదేశాలిచ్చి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే సస్పెండ్‍ ఆర్డర్‍ కాపీలను అందుకునేందుకు ఉపాధ్యాయులు నిరాకరించడంతో సస్పెన్షన్‍ పత్రాలను పాఠశాల గోడలకు అతికించడం జిల్లాలో చర్చానీయాంశమైంది.

సమయపాలన విషయంలో మహబూబ్‍నగర్‍ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చకు కారణమైంది. జిల్లా కేంద్రంలోని మార్కెట్‍ రోడ్‍లో బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఆకస్మిక తనిఖీ చేశారు. తన వాహనాన్ని పాఠశాలకు కొద్ది దూరంలో ఆపి కాలినడకన ఆయన ఉదయం 9 గంటలకు పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయితే 9 గంటల 30 నిమిషాల వరకూ కూడా ఉపాధ్యాయులు స్కూల్‌కు చేరుకోలేదు. 9 గంటల 45 నిమిషాలకు ఒక్కొక్కరూ పాఠశాలకు చేరుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ 9 మందిని సస్పెండ్ చేయాలని డీఈవో‌కు ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్ ఆదేశాలతో డీఈవో కార్యాలయం అధికారులు సస్పెన్షన్ కాపీలను అందించేందుకు పాఠశాలకు వెళ్లారు. అయితే వీటిని తీసుకోవడానికి ఉపాధ్యాయులు అంగీకరించాలేదు. దీంతో సస్పెన్షన్ ఉత్తర్వులను పాఠశాల గోడకు అంటించారు విద్యాశాఖ అధికారులు. అయితే స్పెన్షన్ కు గురైన ఉపాధ్యాయుల మాత్రం తాము సకాలంలోనే పాఠశాలకు వచ్చామని ఖరాఖండిగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల సమయం 9 గంటల 30 నిమిషాలు నుంచి అని, ఉదయం 9 గంటలకే కలెక్టర్ అకస్మిక తనిఖీలు చేసి తమపై వేటు వేయడం చాలా బాధాకరమని వాపోతున్నారు ఉపాధ్యాయులు. అయితే సస్పెన్షన్ ఆర్డర్ తీసుకోని ఉపాధ్యాయులు కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చినా ఆయన మాత్రం వారి వాదన వినేందుకు నిరాకరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories