హైదరాబాద్‌లోనే NHRC బృందం

హైదరాబాద్‌లోనే NHRC బృందం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్ఆర్‌సీ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఎన్‌హెచ్ఆర్‌సి బృందం గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రికి చేరుకున్నారు....

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్ఆర్‌సీ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఎన్‌హెచ్ఆర్‌సి బృందం గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న పోలీసులను విచారించనున్నారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత జరిగిన పరిణామాలపై పోలీసులను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.

నిన్నఎన్‌కౌంటర్ స్పాట్‌ను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం, ఇవాళ నిందితుల తల్లిదండ్రులను విచారించనున్నారు. విచారణలో భాగంగా గుడిగండ్ల, జకేర్లకు చెందిన నిందితుల తల్లిదండ్రులను మక్తల్‌ పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. A1నిందితుడు మహమ్మద్ ఆరీఫ్‌ తండ్రి హుసేన్‌తో పాటు

A2 నిందితుడు శివ తండ్రి రాజన్న, A3 నిందితుడు నవీన్‌ తల్లి లక్ష్మి, A4 నిందితుడు చెన్నకేశవులు తండ్రి కురుమప్పలతో మరికాసేపట్లో విచారించనుంది బృందం.

ఇదిలా ఉంటే మహబూబ్‌నగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌ మార్చురీలో భద్రపరిచి ఉంచిన నిందితుల మృతదేహాలను పోలీసులు మయూరి పార్క్ దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్యశాల నూతన భవనానికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేనందున డెడ్ బాడీస్‌ను తరలించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మార్చురీలో ఉన్న నలుగురి నిందితుల డెడ్‌ బాడీస్ డీ- కంపోజ్ అయ్యాయని వాటిని వెంటనే వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 9 వరకు మృతదేహాలను భద్రపరచాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories