మేడ్చల్ జిల్లాలో అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్

‍New Twist on Medchal District Victimization Incident
x

Representational Image

Highlights

తెలంగాణ మేడ్చల్ జిల్లలో ఘట్‌కేసర్ ప్రాతంఅత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బీ ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు...

తెలంగాణ మేడ్చల్ జిల్లలో ఘట్‌కేసర్ ప్రాతంఅత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బీ ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్‌తో అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. విద్యార్ధినిని కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

అయితే విద్యార్థికి ఆటో డ్రైవర్ తో ఇదివరకే ముఖ పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. రోజు కాలేజీ ఆటోలో వెళ్లే సమయంలోనే పరిచయం ఏర్పడినట్టు పోలీసులు గుర్తించారు. రోజూలాగే కాలేజీ అయిపోయిన తర్వాత ఆటోలో ఇంటికి చేరే సమయంలో ఆటో ఎక్కింది. అప్పటికే ప్రీప్లాన్డ్‌గా ఉన్న ఆటో డ్రైవర్ తన స్నేహితులతో అత్యాచారానికి ఒడిగట్టారు అప్పటికే ఆటోలో ఉన్న మరో ఇద్దరిని కిందకు దింపి.. బాధితురాలిని ఒంటరిని చేసే ప్రయత్నం చేశారు.. జోడిమెట్ల దగ్గరకు రాగానే ఆటోను రోడ్డుపై కాకుండా పక్కన పొదల్లోకి ఆటోని తీసుకెళ్లాడు.

అయితే అప్పటికే యువతికి ఆటోలో ఉన్నవారు అనుమానంగా కనిపించడంతో.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దాంతో వారు డయల్ 100కి కాల్ చేసి చెప్పడంతో యువతి ఫోన్ లోకేషన్ ట్రేస్ చేసి వెతికారు రోడ్డుపై సైరన్‌‌తో పోలీసుల వాహనం రావడంతో.. యువతిని అక్కడే వదిలేసి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గుర్తించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురికి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో నలుగురిపై అనుమానం ఉన్నట్టు తెలుస్తోంది.

నాంపల్లికి చెందిన యువతి ఘట్‌కేసర్ దగ్గలో బీ ఫార్మాసీ చేస్తుంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తేందుకు ఆటో ఎక్కారు. జోడిమెట్ల పొదల్లోకి ఆటోని తీసుకెళ్లి.. బలవంతంగా అత్యాచారం లాక్కెళ్లి అత్యాచారం చేసిన కిరాతకులు యువతిని బట్టలు లేకుండా రోడ్డుపైనే యువతిని వదిలి వెళ్లారు.. సమాచారం అందుకున్న ఘట్‌కేసర్ పోలీసులు యువతిని మేడిపల్లి క్యూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ రక్షితా మూర్తి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories