logo

జాగ్రత్త : కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చాయి.. రాంగ్ రూట్ లో వెళ్లే అంతే సంగతులు

జాగ్రత్త : కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చాయి.. రాంగ్ రూట్ లో వెళ్లే అంతే సంగతులు
Highlights

కొత్తగా వచ్చిన ట్రాఫిక్ రూల్స్ పై కూడా కొంతమంది వాహనదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జరిగే ప్రమాదాలను మనం నివారించవచ్చునని అంటున్నారు.

రాంగ్ రూట్ లో వెళ్ళేవారి తాట తీసేందుకు సిద్దం అయ్యారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. రాంగ్ రూట్ లో వెళ్తే కేసు నమోదు చేయడమే కాదు జరిమానా కూడా విధిస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లి ఇతర ప్రయాణికులకి ఇబ్బంది కలిగుస్తున్నారన్న నేపధ్యంలో వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకునేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్దం అయ్యారు . రాంగ్ రూట్ లో రావడం వల్ల డేంజర్ అని, అది మీకు మాత్రమే కాకుండా ఇతర వాహనదరులకి కూడా హాని కలిగిస్తుందని అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటివి జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేకమైన ద్రుష్టి సాధించారు. అందులో భాగంగానే రోజు 400మంది రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించారు.. రాంగ్‌రూట్‌లో ప్రయాణించినందుకు గాను వారిపై కేసు నమోదు చేసి వెయ్యి రుపాయలను జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ నిఘా అక్టోబర్ ఒకటి నుండే మొదలయ్యాయి.. ఎక్కువగా రాంగ్ రూట్స్ జరుగుతున్న ప్రదేశాల్లో సైబరాబాద్ పోలీసులు 20 ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మాదాపూర్ ఎన్‌ఐఏ బిల్డింగ్, గచ్చిబౌలీ జంక్షన్, మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో 20 రాంగ్‌ రూట్ హాట్‌ స్పాట్లు ఉన్నాయి.

కొత్తగా వచ్చిన ట్రాఫిక్ రూల్స్ పై కూడా కొంతమంది వాహనదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జరిగే ప్రమాదాలను మనం నివారించవచ్చునని అంటున్నారు.


లైవ్ టీవి


Share it
Top