Top
logo

ఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు : మంత్రి హరీశ్‌రావు

ఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు : మంత్రి హరీశ్‌రావుఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు : మంత్రి హరీశ్‌రావు
Highlights

57 ఏళ్లు నిండిన వారందరికీ ఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు...

57 ఏళ్లు నిండిన వారందరికీ ఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పట్టణప్రగతిలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఆరు నెలల్లో సదాశివపేటలో నీటి సమస్యలేకుండా చూస్తామని తెలిపారు.

కొత్తగా వచ్చిన మున్సిపల్‌ చట్టం ప్రజలకు భరోసా ఇస్తుందన్నారు. మున్సిపల్‌ చట్టంతో పారద్శకత పెరుగుతుందన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రతి మున్సిపాలిటీకి ఉన్నతాధికారిని నియమించినట్లు హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, కలెక్టర్‌ హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Web Titlenew pensions from april: minister harish rao
Next Story