సిగ్నల్ వద్ద హారన్ కొడుతున్నారా.. అయితే జాగ్రత్త

సిగ్నల్ వద్ద హారన్ కొడుతున్నారా.. అయితే జాగ్రత్త
x
Highlights

పట్టణాల్లో ఎక్కడ చూసినా ట్రాపిక్, ట్రాఫిక్. రోజు రోజుకు పెరిగిపోతున్న వాహణాల వల్ల పట్టణాల్లోనే కాదు, గ్రామల్లో కూడా ఎన్నో సమస్యలు.

పట్టణాల్లో ఎక్కడ చూసినా ట్రాపిక్, ట్రాఫిక్. రోజు రోజుకు పెరిగిపోతున్న వాహణాల వల్ల పట్టణాల్లోనే కాదు, గ్రామల్లో కూడా ఎన్నో సమస్యలు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలు మాత్రమే కాదు, పర్యావరణ కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోతున్నాయి. అంతే కాదు పట్టణాల్లోని ప్రధాన కూడల్ల వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్ వద్ద సిగ్నల్ పడినా, రద్దీగా ఉంటే రహదారుల్లో చూస్తే వాహణదారులు కొట్టే హాన్లతో ఆ ప్రాంతమంగా హోరెత్తిపోతుంది. దీంతో శబ్ధకాలుష్య తీవ్రత కూడా పెరిగిపోతుంది. దీంతో వయస్సు పైబడిన వారికి, చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎంతో అపాయం కలుగుతుంది. దీని ద్వారా వినికిడి శక్తని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

ఇక ఈ సమస్యల పరిష్కారానికి గతంలో ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసాయి. కానీ అందులో ఏ ఒక్క ప్రయత్నం కూడా సరిగ్గా ఫలించలేదు. అయినప్పటికీ ప్రభుత్వాలు పట్టు వదలకుండా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ముంబయి మహానగరంలో ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఓ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది విధానం గురించి తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దీని పట్ల ఆకర్షితుడయ్యాడు. హారన్ల నిరోధానికి ముంబయిలో అమలు చేస్తున్న విధానాన్ని హైదరాబాద్ నగగరంలో కూడా అమలు చేయాలని దీనికి సంబంధించిన వీడియోను మంత్రి ట్వీట్ చేస్తూ సూచించారు. అసలు ఆ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబయి మహానగరంలో రెండు సముద్రాలు చూడొచ్చు. ఒక వైపు నీళ్లతో నిండిన సముద్రం ఉంటే మరో వైపు వాహణాలతో నిండిన రోడ్లన్నీ మరో సముద్రాన్ని తలపిస్తాయి. దీంతో నగరంలో సిగ్నల్స్‌ పడితే చాలు వాహణదారులు ఒకే రీతిన హార్లను కొట్టి శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారు. దీంతో అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు కాలుష్యాన్ని అరికట్టేందుకు వినూత్న విధానాన్ని అమలు చేసి ఫలితం సాధించారు. ''హారన్‌ నాట్‌ ఓకే ప్లీజ్‌'' నినాదంతో ముందుకెళ్లారు. నిర్దేశిత పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదైతే రెడ్‌ సిగ్నల్‌ తర్వాత గ్రీన్‌ సిగ్నల్‌కు బదులు మళ్లీ 90 సెకన్ల పాటు రెడ్‌ సిగ్నలే కొనసాగిస్తున్నారు. దీంతో హారన్‌ మోగించే వాహనదారులపై తోటి వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హరన్ కొడితే చాలు పక్క వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెడ్ సిగ్నల్‌ పడినా సరే వాహనదారులు మాత్రం ఎంత సేపైనా వేచి చూస్తున్నారే తప్ప కాస్త కూడా శబ్దం చేయడం లేదు. ఇక కూడల్ల వద్ద ఈ శబ్ద కాలుష్యాన్ని కొలిచేందుకు డెసిబల్స్ రూపంలో నమోదు చేసే సెన్సార్లను కూడా ఏర్పాటు చేశారు.

ఇక పోతే ముంబయి తరువాత మహానగరంగా పేరు పొందిన హైదరాబాద్ లో కూడా ఇదే సమస్య నెలకొని ఉంది. ప్రధాన జంక్షన్లయిన పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్ లలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో కేటీఆర్ ముంబయిలో కొనసాగిస్తున్న పద్దతినే ఇక్కడి కూడా అమలు చేయాలని చెపుతున్నారు.

రద్దీ ప్రదేశాల్లో ఎవరైనా సిగ్నల్ పడిన తరువాత హార్ కొడితే చాలు వారికి తగిన మూల్యం చెల్లించే పద్దతిని అమలు చేయాలని, అంతే కాక హారన్ కొడితే, మరింత సేపే సిగ్నల్ ని క్లియర్ చేయకుండా ఉండాలని తెలిపారు. దీంతో హారన్‌ కొట్టిన వాహనదారుడే కాదు, సిగ్నల్‌ వద్ద వేచి ఉన్న మిగతా వాహనదారులు కూడా సైతం వేచి చూడక తప్పదు. ఈ నూతన పద్దతిని

తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ట్యాగ్‌ చేస్తూ పాటిస్తే నగరంలోనూ శబ్ద కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉంటుందని సూచించారు. దీంతో పట్టణ పోలీసులు దీన్ని అమలు చేసే దిశగా పరుగులు తీస్తున్నారు. నగరంలో ఉండే వాహణదారులారా ఇక సిగ్నల్ వద్ద హారన్ కొట్టకుండా కాసేపే వేచి ఉండాల్సిందే.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories