Top
logo

సాయంత్రం లోగా ఆర్టీసీకి కొత్త ఎండీ ?

సాయంత్రం లోగా ఆర్టీసీకి కొత్త ఎండీ ?
Highlights

హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ సంస్థకు ఎండీని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సాయంత్రం ఆర్టీసీ ఎండీని...

హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ సంస్థకు ఎండీని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సాయంత్రం ఆర్టీసీ ఎండీని నియమిస్తారని చెబుతున్నారు. ఆయన సమక్షంలోనే ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగిన చర్చల ప్రక్రియలో ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ డీఎం, డీవీఎం, రీజినల్‌ మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వచ్చే సోమవారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో జిల్లాల్లో 100 శాతం బస్సులు నడపాలని ఆదేశించారు. అయితే జిల్లాల్లో నడుపుతున్నా రాజధాని హైదరాబాద్‌లో మాత్రం 40 శాతానికి మించి బస్సులు నడవడం లేదని అధికారులు తెలిపారు. నగరంలో పూర్తిస్థాయిలో బస్సులు నడపాలంటే అనుభవజ్ఞులైన డ్రైవర్లు కావాలని తెలిపారు. రెండు రోజుల సిటీ బస్సును నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు ఆ తర్వాత రోజు రావడం లేదని వివరించారు. దీంతో విద్యాసంస్థలు తెరిచే లోపు ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో అనుభవజ్ఞులైన డ్రైవర్ల కోసం ఆర్టీసీ వెదుకుతోంది.

Next Story