ఇంటర్ ఒకేషనల్ విద్యలో కొత్త కోర్సులు

ఇంటర్ ఒకేషనల్ విద్యలో కొత్త కోర్సులు
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేషనల్ విద్యను అభ్యసించే విద్యార్థల కోసం ఈ విద్యా సంవత్సరం కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేషనల్ విద్యను అభ్యసించే విద్యార్థల కోసం ఈ విద్యా సంవత్సరం కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది. సోమవారం ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తన కార్యాలయంలో పలు కంపెనీలకు చెందిన యజమానులతో, పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అపోలో మెడిస్కిల్స్, నేషనల్ అకాడ మీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, ఆటోమోటివ్ ఇండస్ట్రీస్, అంబెస్ట్ టెక్నాలజీస్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చా ర్టెర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

వీరంతా కలిసి కొత్త కోర్పుల ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించనున్నాయో అపకప అంశాలపైన చర్చించారు. ఈ ఒకేషనల్ విద్య ద్వారా విద్యార్థలు వారి చదువులను పూర్తి చేసుకోవడంతోనే ఉపాధి అవకాశాలు కలుగుతాయని వారు తెలిపారు. నూతనంగా ప్రవేశపెట్టే ఉపాధి కోర్సులలో బయోమెడికల్ ఈక్విప్‌మెంట్ టెక్నిషియన్, సోలార్‌పవర్ టెక్నిషియన్, ల్యాండ్ సర్వేయర్, సీసీ కెమెరా టెక్నిషియన్, నానో టెక్నిషియన్, హార్టికల్చర్ కోర్సులు ఉన్నాయని వారు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories