Hyderabad: నిలోఫర్‌ ఆస్పత్రిలో నెఫ్రాలజీ సేవలు

Hyderabad: నిలోఫర్‌ ఆస్పత్రిలో నెఫ్రాలజీ సేవలు
x
Highlights

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికి అత్యాధునిక పరికరాలతో ఉచిత వైద్యం అందించేందుకు ఇప్పటి వరకూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అంతే కాకుండా బస్తీలలో ఉండే...

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికి అత్యాధునిక పరికరాలతో ఉచిత వైద్యం అందించేందుకు ఇప్పటి వరకూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అంతే కాకుండా బస్తీలలో ఉండే పేదవారికి ఉచిత వైద్యం అందించేందుకు బస్తీదవాఖానాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులలో అందరికీ అన్ని రకాల నాణ్యమైన, ఉచిత వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంది.

ఇప్పుడు ఈ నేపథ్యంలోనే చిన్నారులకు సంబంధించి మూత్రపిండాల సమస్యలకు ఉచిత వైద్యం అందించేందుకు నీలోఫర్ ఆస్పత్రిలో నెఫ్రాలజీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. నిన్న మొన్నటివరకూ మూత్రపిండాల సమస్యతో బాధపడే చిన్నారులను ఉస్మానియా దవాఖానకు పంపించే విధంగా వైద్యులు సిఫారసు చేసేవారు. కానీ ఆ ఆస్పత్రిలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో త్వరిత గతిన వైద్యం అందడం లేదంటూ చాలా మంది ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీంతో ప్రయివేటు వైద్యులు దాన్ని అదునుగా చేసుకుని రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

దీంతో ఎంతో మంది నిరుపేదలు వైద్యం చేపించుకోలేక వారి ప్రాణాలకు కూడా వదిలేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ నిలోఫర్‌ దవాఖానలో మూత్రపిండ సమస్యలున్న చిన్నారులకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ వైద్యం ప్రయివేటు ఆస్పత్రులలో చేయిస్తే దాదాపుగా లక్షల్లో ఖర్చవుతాయి. దీంతో నిలోఫర్‌ దవాఖానలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఉస్మానియా నెఫ్రాలజీ విభాగం నుంచి ఒక ప్రొఫెసర్‌, ఒక పీజీ వైద్యులు నీలోఫర్ లో వైద్య సేవలందిస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories