నలుగురు గొర్రెల కాపర్లను కాపాడిన NDRF బృందం

నలుగురు గొర్రెల కాపర్లను కాపాడిన NDRF బృందం
x
Highlights

వాగులో చిక్కుకున్న గొర్రెల కాపర్లను NDRF బృందం కాపాడింది. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లెకు చెందిన గొర్రెల కాపర్లు గొర్రెలు మేపేందుకు ఖమ్మం జిల్లా వైపు వచ్చారు.

వాగులో చిక్కుకున్న గొర్రెల కాపర్లను NDRF బృందం కాపాడింది. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లెకు చెందిన గొర్రెల కాపర్లు గొర్రెలు మేపేందుకు ఖమ్మం జిల్లా వైపు వచ్చారు. అయితే చింతకాని మండలం సమీపంలో ఉన్న మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహించింది. దీంతో ఆదివారం నలుగురు గొర్రెల కాపర్లు, 400 గొర్రెలు లంకలో చిక్కుకున్నాయి.

ఆదివారం సాయంత్రం నుంచి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం చేసే వారి కోసం ఎదురుచూశారు. సమాచారం తెలుసుకున్న NDRF బృందం రంగంలోకి దిగింది. 10వ బెటాలియన్‌కు చెందిన 35మంది సిబ్బంది నిన్న రాత్రి బోటు సహాయంతో వరదలో చిక్కుకున్న నలుగురు గొర్రెల కాపర్లను కాపాడారు. గొర్రెలు మాత్రం ఇంకా లంకలోనే ఉన్నాయి... వాటిలో ఎన్ని వరదలో కొట్టుకుపోయాయో తెలియరాలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories