రాష్ట్రంలో 8న జాతీయ లోక్‌అదాలత్‌

రాష్ట్రంలో 8న జాతీయ లోక్‌అదాలత్‌
x
Highlights

రాష్ట్రంలోని సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టు, దిగువస్థాయి కోర్టుల వరకు ఈ నెల 8వ తేదీన లోక్‌అదాలత్‌ నిర్వహించాలని జాతీయ న్యాయసేవల అథారిటీ నిర్ణయించింది.

రాష్ట్రంలోని సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టు, దిగువస్థాయి కోర్టుల వరకు ఈ నెల 8వ తేదీన లోక్‌అదాలత్‌ నిర్వహించాలని జాతీయ న్యాయసేవల అథారిటీ నిర్ణయించింది. ఈ లోక్‌అదాలత్‌లో ఎన్నో ఏండ్లనుంచి పరిష్కారం కాని సివిల్‌ కేసులు, రాజీపడదగిన క్రిమినల్‌ కేసులకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ అదాలత్ సేవలను పొందడానికి గాను ఎలాంటి కోర్టు ఫీజులు అవసరం లేదని, ఇంతకు ముందు కోర్టుకు చెల్లించిన ఫీజులను కూడా తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు.

గతేడాది 3,081 న్యాయ సాక్షరత శిబిరాలను నిర్వహించారని రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా పరిష్కారమైన కేసులపై అప్పీల్‌ ఉండదని, అన్యాయం జరిగిన వారికి ఈ కార్యక్రమంలో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ అదాలత్ ను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్యాట్రన్‌ ఇన్‌చీఫ్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యకార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

అసలు లోక్ అదాలత్ అంటే ఏమిటి ?

లోక్ అదాలత్ లకు చట్టబద్ధత ఉంది. కక్షిదారులు తమ వివాదాలను సామరస్యంగా పరి ష్కరించు కోవడానికి వీలుగా శాశ్వత ప్రాతిపాదిక పై పనిచేసే లోక్ అదాలత్ అంటారు. ఇది అన్ని జిల్లాలలోనూ ప్రతి ఏడాది ప్రాతి కోర్టులోనూ ఏర్పాటు చేస్తారు. ఈ అదాలత్ లో ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు ఇచ్చే డిగ్రీలతో లేక ఇతరకోర్ట్లు ఇచ్చే ఆర్డర లతో సమాన హోదా కలిగి ఉంటాయి. ఇక సారి అదాలత్ లో తీర్పు వెలువడిన తరువాత దానికి వ్యతిరేకంగా వేరే ఏ కోర్టులోను అప్పీలు చేసుకోవడానికి వీలు ఉండదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories