Telangana: నేడు నాంపల్లి కోర్టులో ఉగ్రవాది కరీం తుండా కేసు విచారణ

Telangana: నేడు నాంపల్లి కోర్టులో ఉగ్రవాది కరీం తుండా కేసు విచారణ
x
నేడు నాంపల్లి కోర్టులో ఉగ్రవాది కరీం తుండా కేసు విచారణ
Highlights

తాంజియా ఇస్లామిక్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థకి చెందిన కరీం తుండా కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. 1992 బాబ్రీ మసీద్‌...

తాంజియా ఇస్లామిక్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థకి చెందిన కరీం తుండా కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. 1992 బాబ్రీ మసీద్‌ కూల్చివేత అనంతరం ప్రతీకారంతో దేశ వ్యాప్తంగా ఈ ఉగ్రవాద సంస్థ అల్లర్లు సృష్టించాయి. దేశ వ్యాప్తంగా 40 పేలుళ్లకు చేసిన ప్రణాళికలో తుండా హస్తం ఉన్నట్లు గుర్తించారు. లష్కర్‌ ఏ తోయిబా తరఫున బాంబులు తయారు చేసినట్లు తుండాపై ఆరోపణలు ఉన్నాయి.

ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో తుండా బాంబులు పెట్టినట్లు తుండాకు జలీల్‌ అన్సారీ సహకరించినట్లు గుర్తించారు. 1990లో అబ్ధుల్‌ కరీం తుండా యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించినట్లు పోలీసులు నిర్ధారించారు. కొన్నేళ్లపాటు పాకిస్థాన్‌లో తలదాచుకున్న అతడిని ఏడేళ్ల కింద నేపాల్‌ సరిహద్దులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఘజియాబాద్‌ జైల్లో ఉన్న కరీం తుండాను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories