logo

కాచిగూడ కార్పోరేట్‌ కన్నా చైతన్య డిస్క్వాలిఫై

కాచిగూడ కార్పోరేట్‌ కన్నా చైతన్య డిస్క్వాలిఫై
Highlights

హైదరాబాద్‌ కాచిగూడ కార్పోరేటర్‌ కన్నా చైతన్యను డిస్‌క్వాలిఫై చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ముగ్గురు...

హైదరాబాద్‌ కాచిగూడ కార్పోరేటర్‌ కన్నా చైతన్యను డిస్‌క్వాలిఫై చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ముగ్గురు సంతానం కలిగి ఉన్నారని గతంలో బీజేపీ మాజీ కార్పోరేటర్‌ ఉమాదేవీ భర్త రమేష్‌ యాదవ్‌ నాంపల్లి కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు కార్పోరేటర్‌గా చైతన్యను డిస్‌క్వాలిఫై చేస్తూ తీర్పునిచ్చింది. రెండోస్థానంలో ఉన్న ఉమాదేవీ రమేశ్‌యాదవ్‌ను కార్పొరేటర్‌గా కొనసాగించాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో ఉమా రమేశ్‌ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే కింది కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టుకు వెళ్తానంటున్నారు కాచిగూడ కార్పోరేటర్‌ కన్నా చైతన్య. తనకు ఇద్దరు పిల్లలు మాత్రమే సంతానమని అన్నారు. బీజేపీ మాజీ కార్పోరేటర్‌ తప్పుడు ఆరోపణలతో కోర్టుని ఆశ్రయించారని తెలిపారు. రమేష్‌ యాదవ్‌ ఉద్దేశపూర్వకంగానే తనపై కోర్టుకు వెళ్లారని, చివరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కార్పోరేటర్‌ కన్నా చైతన్య.


లైవ్ టీవి


Share it
Top