మున్పిపోల్స్: ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్ల ముసాయిదా.. రిజర్వేషన్లు

మున్పిపోల్స్: ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్ల ముసాయిదా.. రిజర్వేషన్లు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జాతర ప్రారంభం అయింది. ఇందుకు సంబంధించి రెండు ముఖ్యమైన ఘట్టాలు పూర్తి అయ్యాయి. ఓటరు జాబితాపై కసరత్తు చేసిన...

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జాతర ప్రారంభం అయింది. ఇందుకు సంబంధించి రెండు ముఖ్యమైన ఘట్టాలు పూర్తి అయ్యాయి. ఓటరు జాబితాపై కసరత్తు చేసిన అధికారులు చివరికి ముసాయిదాను, అదే విధంగా రిజర్వేషన్లను కూడా విడుదల చేసారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే

ఓటర్ల ముసాయిదా..

నల్గొండ జిల్లా నీలగిరి పరిధిలోని 48 వార్డుల్లో మొత్తం 1,27,044 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 62,215 మంది, మహిళలు 64,828 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. ఇదే విధంగా ఈ సారి వర్గాల వారిగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఇతరుల ఓట్లను వార్డుల వారీగా విభజించి లెక్క తేల్చి తుది జాబితాను తయారు చేసింది. తుది ఓటరు జాబితా ప్రకారం 39 వార్డుల్లో 2,613 మంది మహిళా ఓటర్లు ఉండగా, 9 వార్డుల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఒక కులాల వారిగా చూసుకుంటే ఎస్సీ ఓటర్లు 18,486మంది ఉండగా, ఎస్టీ ఓటర్లు 1,483 మంది ఉన్నారు. అదే విధంగా బీసీ ఓటర్లు 79,632, ఇతరులు ఒకటిగా ఉన్నారు. జనరల్‌ ఓటర్లు 27,443 మంది ఉన్నారు.

ఇక చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 11,094 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 5,578 మంది ఓటర్లు ఉండగా, మహిళలు 5,516 మంది ఉన్నారు. అలాగే వీరిలో కులాల వారిగా చూసుకుంటే జనరల్‌ 2,650 మంది ఓటర్లు, ఎస్‌సీలు 1975 మంది, బీసీలు 6337 మంది, ఎస్‌టీ 132మంది ఓటర్లు ఉన్నారు. దేవరకొండ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 21,590 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 10,995 ఉండగా, పురుషుల 10,595 మంది ఉన్నారు.

మిర్యాలగూడ మున్సిపాలిటీలోని 48 వార్డులకు చెందిన ఓటర్లను కూడా కులాల వారిగా ప్రకటింటినట్టు మున్సిపల్‌ కమిషనర్‌ దేవ్‌సింగ్‌ తెలిపారు. మున్సిపాలిటీలో మొత్తం 87.431 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 44,685 మంది, పురుషులు 42,744 మంది ఓటర్లున్నారు. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులుండగా 10,055 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 5,128, మహిళలు 4,927 మంది ఉన్నారు. నందికొండ (నాగార్జునసాగర్‌) మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 12,715 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలు 6,555 మంది, పురుషులు 6,160 మంది ఉన్నారు.

రిజర్వేషన్లు...

రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు కార్పొరేషన్‌ మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, డివిజన్‌, వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లను చూసుకుంటే

నల్లగొండ- జనరల్‌, చండూర్‌- బీసీ మహిళ, చిట్యాల- జనరల్‌, దేవరకొండ- జనరల్‌, నందికొండ(నాగార్జునసాగర్‌)- మహిళ జనరల్‌, హాలియ- జనరల్‌, మిర్యాలగూడ- జనరల్‌.

యాదాద్రి భువనగిరిజిల్లాలోని మున్సిపల్ రిజర్వేషన్లను చూసుకుంటే..

భువనగిరి- బీసీ, ఆలేరు- బీసీ జనరల్‌, పోచంపల్లి- మహిళ జనరల్‌, మోత్కూర్‌- మహిళ జనరల్‌, చౌటుప్పల్‌- బీసీ జనరల్‌, యాదగిరిగుట్ట- బీసీ మహిళ

సూర్యాపేట జిల్లాలోని మున్సిపల్ రిజర్వేషన్లను చూసుకుంటే..

సూర్యాపేట- మహిళ జనరల్‌, నేరేడుచర్ల- ఎస్సీ జనరల్‌, హుజూర్‌నగర్‌- మహిళ జనరల్‌, కోదాడ- మహిళ జనరల్‌.

ఇక ఇదే నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీలీలోని వార్డుల వారిగా రిజర్వేషన్లను చూసుకుంటే

1వ వార్డు- జనరల్ మహిళా, 2వ వార్డు- ఎస్సీ, 3వ వార్డు- ఎస్టీ, 4వ వార్డు- ఎస్టీ, 5వ వార్డు- జనరల్, 6వ వార్డు- ఎస్టీ మహిళా, 7వ వార్డు- బిసి మహిళా, 8వ వార్డు- జనరల్ మహిళ, 9వ వార్డు- ఎస్సీ, 10వ వార్డు- ఎస్సీ మహిళా, 11వ వార్డు- జనరల్ మహిళా, 12వ వార్డు- ఎస్సీ, 13వ వార్డు- జనరల్, 14వ వార్డు- జనరల్ మహిళా, 15వ వార్డు- జనరల్, 16వ వార్డు- జనరల్ మహిళా, 17వ వార్డు- ఎస్సీ, 18వ వార్డు- ఎస్టీ మహిళా, 19వ వార్డు- జనరల్ మహిళా, 20వ వార్డు- బీసీ, 21వ వార్డు- బీసీ మహిళా, 22వ వార్డు- బీసీ, 23వ వార్డు- ఎస్సీ మహిళా, 24వ వార్డు- బీసీ మహిళా, 25వ వార్డు- బీసీ మహిళా, 26వ వార్డు- బీసీ, 27వ వార్డు- బీసీ మహిళా, 28వ వార్డు- బీసీ, 29వ వార్డు- బీసీ, 30వ వార్డు- జనరల్ మహిళా, 31వ వార్డు- జనరల్ మహిళా, 32వ వార్డు- జనరల్, 33వ వార్డు- జనరల్ మహిళా, 34వ వార్డు- జనరల్, 35వ వార్డు- ఎస్సీ మహిళా, 36వ వార్డు- జనరల్ మహిళా, 37వ వార్డు- బీసీ, 38వ వార్డు- బీసీ మహిళ, 39వ వార్డు- జనరల్, 40వ వార్డు- బీసీ, 41వ వార్డు- జనరల్, 42వ వార్డు- జనరల్ మహిళా, 43వ వార్డు- జనరల్ మహిళా, 44వ వార్డు- జనరల్, 45వ వార్డు- జనరల్, 46వ వార్డు- జనరల్, 47వ వార్డు- జనరల్ మహిళా, 48వ వార్డు- జనరల్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories