తిట్టుకున్న నేతల మధ్య సరికొత్త స్నేహం

తిట్టుకున్న నేతల మధ్య సరికొత్త స్నేహం
x
Highlights

హుజూర్‌నగర్ ఉపఎన్నిక నల్గొండ కాంగ్రెస్‌ నేతలను ఏకంచేసింది. ఇప్పటివరకు తిట్టుకున్న లీడర్ల మధ్య సరికొత్త స్నేహం చిగురించేలా చేసింది. ఒకరు ఔనంటే మరొకరు...

హుజూర్‌నగర్ ఉపఎన్నిక నల్గొండ కాంగ్రెస్‌ నేతలను ఏకంచేసింది. ఇప్పటివరకు తిట్టుకున్న లీడర్ల మధ్య సరికొత్త స్నేహం చిగురించేలా చేసింది. ఒకరు ఔనంటే మరొకరు కాదనే నేతలు ఇప్పుడు తమ అందరిదీ ఒకే మాట అంటున్నారు. ఇంతకీ ఆ మార్పుకి కారణమేంటో చూడండి.

హుజూర్‌‌నగర్ ఉపఎన్నికల అభ్యర్ధిపై పార్టీలో తలెత్తిన వివాదం నల్గొండ కాంగ్రెస్‌ నేతలను ఒక్కటి చేసింది. ఎప్పుడూ ఉప్పూనిప్పులా ఉండే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య స్నేహం చిగురించింది.

ఉత్తమ్‌ సతీమణి పద్మావతిని హుజూర్‌నగర్ ఉపఎన్నిక బరిలో నిలపాలన్న నిర్ణయంపై అభ్యంతరం చెప్పిన రేవంత్‌ రెడ్డి పార్టీలో చర్చించకుండా అభ్యర్ధిని ఎలా ఖరారు చేస్తారంటూ ప్రశ్నించారు. అంతేకాదు హుజూర్‌నగర్ అభ్యర్ధిగా శ్యామల కిరణ్‌రెడ్డిని తెరపైకి తెచ్చాడు. దాంతో రేవంత్‌‌పై ఉత్తమ్‌తోపాటు నల్గొండ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో నా భార్యను అభ్యర్ధిగా ఎంపిక చేయడంలో తప్పేముందని ఉత్తమ్‌ ఉంటుంటే, అయినా మా జిల్లాలో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ నల్గొండ కాంగ్రెస్ లీడర్లు ఫైరవుతున్నారు. తమ జిల్లా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం తమకుందని, ఇతరులు తమ జిల్లా రాజకీయాల్లో వేలుపెడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. ఇక, ఉత్తమ్‌కు మద్దతుగా నిలిచిన కోమటిరెడ్డి హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పద్మావతిని గెలిపించుకుని తీరతామని ప్రకటించారు. అయితే, ఇన్ని రోజులూ పక్కలో బల్లెంలా ఉన్న కోమటిరెడ్డి మద్దతివ్వడంతో ఊపిరిపీల్చుకున్న ఉత్తమ్‌ మిగతా నేతలతో కలిసి రేవంత్‌ను టార్గెట్‌ చేశారు.

మొత్తానికి రేవంత్‌రెడ్డి మూలంగా నల్గొండ కాంగ్రెస్‌లో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇప్పటివరకు తిట్టుకున్న నేతల మధ్య సరికొత్త స్నేహం చిగురించింది. ఒకరు ఔనంటే మరొకరు కాదనే నేతలు ఇప్పుడు తమ అందరిది ఒకే మాట అంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories